కేవలం 2 గంటల్లో హైదరాబాద్ నుంచి బెంగళూరు.. హైస్పీడ్ కారిడార్!

గ్రేటర్ హైదరాబాద్ నుంచి చెన్నైకి, బెంగళూరుకు హై-స్పీడ్‌ ట్రైన్‌ కారిడార్ ఏర్పాటు చేయనుంది ఇండియన్ రైల్వేస్. హైదరాబాద్‌ టూ బెంగళూరు 2 గంటల ప్రయాణం, చెన్నైకి 2 గంటల 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. గంటలకు 320 కి.మీ వేగంతో హై-స్పీడ్‌ ట్రైన్‌ ప్రయాణించనుంది.

New Update
high speed corridors

high speed corridors Photograph: (high speed corridors)

హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగుళూరు వెళ్లే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌. గ్రేటర్ హైదరాబాద్ నుంచి చెన్నైకి, బెంగళూరుకు హై-స్పీడ్‌ ట్రైన్‌ కారిడార్ ఏర్పాటు చేయనుంది ఇండియన్ రైల్వేస్. దీంతో దాదాపు 10 గంటల ప్రయాణ సమయం తగ్గనుంది. ఈ హై-స్పీడ్‌ ట్రైన్‌‌లో కేవలం 2 గంటల్లోనే చెన్నై చేరుకోవచ్చు. ప్రస్తుతం సర్వే దశలో ఉన్న హై-స్పీడ్‌ ట్రైన్‌ కారిడార్లు.. ఎలివేటెడ్ ట్రాక్‌లపై గంటలకు 320 కి.మీ వేగంతో హై-స్పీడ్‌ ట్రైన్‌ ప్రయాణించనుంది. ముంబై - అహ్మదాబాద్‌ బుల్లెట్‌ ట్రైన్‌ నమూనాను అనుసరించి ఈ హై స్పీడ్ ట్రైన్లు ఏర్పాటు చేయనుంది.
 
హైస్పీడ్‌ ట్రైన్‌తో ఫ్లైట్‌ కంటే వేగంగా హైదరాబాద్‌ నుంచి చెన్నై, బెంగళూరుకు నగరాలకు చేరుకోవచ్చు. హైదరాబాద్‌ టూ బెంగళూరు 2 గంటల ప్రయాణం, చెన్నైకి 2 గంటల 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి చెన్నై 705 కి.మీ దూరం మేర హై-స్పీడ్ కారిడార్ ఉంటుంది. హైదరాబాద్ టూ బెంగళూరు మార్గం 626 కి.మీ దూరం ఉంటుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు