Metro: హైదరాబాద్ వాసులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని మెట్రో రైలును మార్గాన్ని మరింత పొడిగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జేబీఎస్ నుంచి శామీర్పేట్, ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు రెండు కారిడార్లను పొడగించేందుకు సీఎం రేవంత్ అంగీకారం తెలిపారు. ప్యారడైజ్ నుంచి తాడ్బన్, సుచిత్ర, కొంపల్లి, కండ్లకోయ మీదుగా మేడ్చల్ వరకు 23 కి.మీ పొడగించనున్నారు. మరో లైన్ జేబీఎస్ నుంచి కార్ఖానా, తిరుమలగిరి, అల్వాల్, హకీంపేట మీదుగా శామీర్ పేట్ 22 కి.మీ రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. దీనిపై బుధవారం అధికారులతో చర్చించిన సీఎం రేవంత్ DPRలు సిద్ధం చేసి, కేంద్రానికి పంపాలని ఆదేశించారు.
మా ప్రజల కష్టాలు తీరుతాయి.. పొన్నం
ఇక సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయంపై రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంతోషం వ్యక్తం చేశారు. గతంలో తాను శామీర్ పేట వరకు మెట్రో పొడిగించాలని విజ్ఞప్తి చేసినట్లు గుర్తు చేశారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, అదిలాబాద్ వెళ్లే వాహనాలు రద్ధీ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పుడు జేబిఎస్ నుంచి శామీర్ పెట్.. ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు మెట్రో ఫేజ్ -2 'బి'కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తమ ప్రాంత ప్రయాణికులు కష్టాలు తొలగనున్నాయన్నారు. ఈ మెట్రో లైన్ ద్వారా హైదరాబాద్ నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాలకు వెళ్లే ప్రయాణికుల సమయం ఆదా అవుతుందన్నారు.
ఇది కూడా చదవండి: New year 2025: ఖమ్మంలో కుమ్మేశారు.. వంద కోట్లు దాటిన మద్యం అమ్మకాలు!
మూడు నెలల్లో డీపీఆర్ సిద్ధం..
ఇక మూడు నెలల్లో ఈ కారిడార్ డీపీఆర్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేసినట్లు హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నార్త్ వాసుల మెట్రో రైల్ కల నెరవేరబోతోంది. వెంటనే డీపీఆర్ లను సిద్ధం చేసి మెట్రో రైల్ ఫేజ్-2 'బి'కి సంబంధించి ప్రణాళికును కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపింస్తాం. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ దానకిషోర్, హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో ఈ రెండు కారిడార్లకు సంబంధించి సీఎం కీలక ఆదేశాలిచ్చారు. గత మల్కాజ్ గిరి ఎంపీగా ఈ ప్రాంతం ట్రాఫిక్ సమస్యలపై, మ్యాప్ లపై తనకు అవగాహన ఉందని, ప్రస్తుత ఎంపీ ఈటెల రాజేందర్ సలహాల తీసుకోవాలని సీఎం రేవంత్ చెప్పినట్లు మెట్రో ఎండీ తెలిపారు.