సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన పై సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు సమాచారం, ప్రజలను అపోహలకు గురి చేసేలా వీడియోలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాంమని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్లు కొందరు తప్పుడు వీడియోలు పోస్టు చేస్తున్నారని హైదరాబాద్ పోలీసులు ఫైర్ అయ్యారు. ఈ అంశం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ ఘటన పై విచారణ క్రమంలో తెలిసిన నిజాలను వీడియో రూపంలో పోలీసు శాఖ ఇప్పటికే ప్రజల ముందు ఉంచిందన్నారు. అయినా.. కొందరు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు క్రియేట్ చేసిన కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా పోస్టులు చేస్తున్నారన్నారు. ఈ విషయం మా దృష్టికి వచ్చిందని తెలిపారు. కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఇలాంటి ఉద్దేశపూర్వక తప్పుడు ప్రచారాలు చేయడంపై సీరియస్ అయ్యారు హైదరాబాద్ పోలీసులు. అలాంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఇది కూడా చదవండి: 2024 Roundup: హైదరాబాద్‌లో అంతు లేని నేరాలు.. ఏడాదిలో ఎన్ని వేల కేసులంటే? ఈ విషయంలో పోలీసు శాఖను బద్నాం చేసేలా తప్పుడు ప్రచారం చేస్తే సీరియస్ గా పరిగణిస్తామన్నారు. ఒక అమాయకురాలి మరణం, ఒక పిల్లవాడి ప్రాణానికి ప్రమాదం సంభవించిన ఈ కేసులో పోలీసు శాఖ ఎంతో నిబద్ధతతో విచారణ జరుపుతోందని స్పష్టం చేశారు. దానిని ప్రశ్నించేలా అసత్య ప్రచారాలు, అభూతకల్పనలతో సోషల్ మీడియా ద్వారా ఎవరైనా ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఏ పౌరుడి దగ్గరైనా ఆధారాలు, అదనపు సమాచారం ఉంటే పోలీసు శాఖకు అందించాలని సూచించారు. అంతే కానీ, సొంత వ్యాఖ్యానాలు చేయవద్దని పోలీసు శాఖ తరపున విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు ప్రకటనలో పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: KIMS: వెంటిలేటర్ తీసేసాం..శ్రీతేజ్ హెల్త్ అప్‌డేట్.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన పై సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు సమాచారం, ప్రజలను అపోహలకు గురి చేసేలా వీడియోలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు …. కొందరు తప్పుడు వీడియోలు పోస్టు చేసిన అంశం మా దృష్టికి వచ్చింది. ఈ ఘటన పై విచారణ… — Hyderabad City Police (@hydcitypolice) December 25, 2024 అసలేమైంది? ఈ రోజు ఉదయం నుంచి అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఆయనను సపోర్ట్ చేసే వారు ఓ వీడియోను వైరల్ చేస్తున్నారు. డిసెంబర్ 4న రాత్రి 9.45-9.50 గంటల మధ్యలో అపస్మారక స్థితిలో ఉన్న రేవతి, శ్రీతేజ్‌ను బయటకు తీసుకువస్తున్నట్లు పోలీసులు చెప్పారని ఆ వీడియోలో పేర్కొన్నారు. అయితే.. రాత్రి 9.16 గం.లకు రేవతిని బయటికి తీసుకొస్తున్నట్లు సీసీ ఫుటేజ్ లో కనిపిస్తోందని వారు వాదిస్తున్నారు. అయితే.. అల్లు అర్జున్ రాత్రి 9.40కి థియేటర్‌లోకి వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారని పేర్కొన్నారు. దీన్ని బట్టి అల్లు అర్జున్ రాకముందే థియేటర్‌లో తొక్కిసలాట జరిగిందన్న బన్నీ ఫ్యాన్స్ వాదన. అయితే.. పోలీసులు మాత్రం సీసీ ఫుటేజ్ లో సమయం అరగంట ఆలస్యం ఉందని ఇప్పటికే తెలిపారు. ఈ నేపథ్యంలో మళ్లీ వైరల్ చేయడంపై పోలీసులు ఫైర్ అవుతున్నారు.