Hyderabad: హైదరాబాద్‌లో 144 సెక్షన్ అమలు.. అతిక్రమిస్తే చర్యలు తప్పవు

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సిటీలో 144 సెక్షన్‌ విధించారు. ఒక నెల రోజుల పాటు అనగా నవంబర్ 28 వరకు నగరంలో ఎలాంటి సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని తెలిపారు. నలుగురు కంటే ఎక్కువమంది ర్యాలీ, సమావేశాలు నిర్వహించి అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 

New Update
hyderabad 2

హైదరాబాద్‌లో 144 సెక్షన్‌ను నగర పోలీసులు విధించారు. ఒక నెల రోజుల పాటు ఈ ఆంక్షలు ఉంటాయని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఎలాంటి సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని తెలిపారు. ఒకవేళ ఎలాంటి సమావేశాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇది కూడా చూడండి: జగన్‌, షర్మిల ఆస్తుల వివాదం..మధ్యలో పవన్ ఎంట్రీ? వారి ఛాప్టెర్ క్లోజ్!

నలుగురు కంటే ఎక్కువ మంది గుంపుగా ఉంటే..

నవంబర్ 28 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. నలుగురు లేదా అంతకంటే ఎక్కువమంది వ్యక్తులు సమావేశం లేదా ర్యాలీలు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని నగర పోలీసు కమిషనర్ తెలిపారు.

ఇది కూడా చూడండి: Breaking: ఆగని బాంబు బెదిరింపులు.. విజయవాడలోని ఓ హోటల్‌కు..

తెలంగాణ స్పెషల్ పోలీసులు, వారి కుటుంబ సభ్యులు ప్రస్తుతం తెలంగాణలో ఆందోళనలు చేపడుతున్నారు. ఒకే రాష్ట్రం-ఒకే పోలీసింగ్ విధానం అమలు చేయాలని నిరసనలు చేస్తున్నారు. ఈ క్రమంలో కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు సెక్రటేరియట్ ముందు ఆందోళలు చేపట్టారు. దీంతో 39 మంది కానిస్టేబుళ్లను పోలీస్ శాఖ సస్పెండ్ చేయగా.. మరో 10 మందిని డిస్మిస్ చేసింది.

ఇది కూడా చూడండి: అరుదైన ఘనత.. దేశంలోనే అత్యుత్తమ బ్యాంక్‌గా..

ఇదిలా ఉండగా నిన్న జరిగిన రేవ్ పార్టీలో ప్రముఖ బీఆర్‌ఎస్ నేతలు ఉన్నారని వార్తలు వచ్చాయి. దీంతో వారు ఆందోళనలు, ధర్నాలకు దిగుతారు ఏమోనని ముందు జాగ్రత్తగా పోలీసుశాఖ ఈ హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: ట్రామీ తుపాను బీభత్సం.. 130కి చేరిన మృతుల సంఖ్య

Advertisment
Advertisment
తాజా కథనాలు