/rtv/media/media_files/2025/04/03/p7FZRtACWUx6gBi4fYjq.jpeg)
HCU land high court Photograph: (HCU land high court)
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను ప్రభుత్వం విక్రయించకుండా ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణను ఏప్రిల్ 7 కోర్టు వాయిదా వేసింది. అప్పటి వరకూ వివాదంలో ఉన్న భూమిలో చెట్లను కొట్టివేయవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్‌లో ప్రతివాదులకు నోటీసులు పంపింది. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని కోరింది. చెట్లు నరకొద్దని స్టే ఉన్న.. 400 ఎకరాల్లో చెట్లు తొలగిస్తున్నట్లు పిటిషనర్ తరపు న్యాయవాది ఆధారాలు కోర్టుకు చూపించారు.
Also read: Heavy rain : హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షం (VIDEO)
Breaking News
— Radha Parvathareddy (@radhachinnulu) April 3, 2025
HCU కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్లు కొట్టివేతపై స్టే విధించిన హైకోర్టు
విచారణ ఏప్రిల్ 7 వరకు వాయిదా వేసిన హైకోర్టు
ఈనెల 7 వరకు అక్కడ చెట్లు కొట్టివేయవద్దని హైకోర్టు స్టే
కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ చెట్లు కొట్టివేత కొనసాగుతుందని ఆధారాలు చూపించిన పిటీషనర్ తరఫు… pic.twitter.com/P1xZppbtfx
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కనున్న 400 ఎకరాల భూమి విక్రయించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్న విషయాలు తెలిసిందే. 400 ఎకరాలు అమ్మి అక్కడ కాంక్రీట్ జంగల్ చేయోద్దని HCU విద్యార్థులు, ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ విషయంలో పలువురు సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించారు. నేడు సుప్రీం కోర్టులో కూడా హెచ్సీయూ భూవివాదం విచారణ జరగనుంది. ఈకేసులో నివేదిక ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు పంపింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు చెట్లు నరకకుండా చూడాలని సీఎస్‌కు సుప్రీంకోర్టు ఆదేశించింది.