హైదరాబాద్‌లో ఫేక్ సిమ్ కార్డ్స్ అమ్ముతున్న ముఠా వ్యవహారాన్ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ బయటపెట్టింది. తెలంగాణ పోలీసులు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ హైదరాబాద్ టీం కలిసి చేసిన ఆపరేషన్‌లో నకిలీ సిమ్ కార్డ్స్ దందా వెలుగుచూసింది. గ్రేటర్ హైదరాబాద్‌లోని ఓ వొడాఫోన్ అండ్ ఐడియా స్టోర్‌లో ఫిబ్రవరి 2న (ఆదివారం) డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు.
Breaking the chain of fraud 🚨
— DoT India (@DoT_India) February 2, 2025
Hyderabad: DoT field unit's raid busts illegal use of telecom resources.
Two 512-slot SIM boxes and 130 SIMs were seized. pic.twitter.com/iID2I9snBg
రైడ్స్‌లో భాగంగా ఓ వొడాఫోన్, ఐడియా స్టోర్‌లో 512 సిమ్ కార్డ్ స్లాట్‌లు, 130 నకిలీ సిమ్ కార్డులు ఉన్నట్లు గుర్తించారు. DoT హైదరాబాద్ యూనిట్ వాటిని స్వాధీనం చేసుకుంది. ఈ సిమ్‌కార్డులను బ్యాంకు మోసాలకు, అక్రమ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నట్లు పలువురు అధికారులు అనుమానిస్తున్నారు.
Also Read: Anasuya: అంతా నా ఇష్టం.. బికినీలో కాదు.. మొత్తం విప్పి తిరుగుతా మీకెందుకూ? : అనసూయ
ఈ ప్రాంతంలో నకిలీ సిమ్ కార్డులు అమ్ముతున్నట్లు POS (పాయింట్ ఆఫ్ సేల్) ఏజెంట్ దృష్టికి వచ్చింది. వోడాఫోన్-ఐడియా స్టోర్ నుంచి ఏజెంట్ ఇప్పటికే దాదాపు 500 నకిలీ సిమ్ కార్డులను విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది. ఇవి రిజిస్టర్ కానీ టెలిమార్కెటర్లకు సప్లై చేయబడుతున్నాయని తెలిసింది. బల్క్ స్పామ్ మెసేజ్‌లు పంపడానికి వీటిని వాడుతున్నారు. స్వాదీనం చేసుకున్న 130 సిమ్ కార్డ్‌లు గవర్నమెంట్ నెట్‌వర్క్ BSNLకి చెందినవి. తెలంగాణ పోలీసులు కస్టమర్, ఇద్దరు POS ఏజెంట్లపైన కేసు ఫైల్ చేశారు. ప్రస్తుతం ఈ ఏజెంట్లు పరారీలో ఉండడంతో పోలీసులు కేసును స్పీడ్‌గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.