Hydra: మరో బిగ్ టాస్క్‌ చేపట్టిన హైడ్రా.. నెక్ట్స్ టార్గెట్ వారే!

హైడ్రా మరో బిగ్ టాస్క్‌ చేపట్టింది. హైదరాబాద్ నగరంలో నాలాలు, పుట్ పాత్‌లపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. లక్డీకాపూల్, రాజ్‌భవన్‌‌ ప్రాంతాల్లో ఆయన పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. 

New Update
Ranganath - Hydra

చెరువులు కబ్జా చేసిన వాళ్లకు వణుకు పుట్టించిన హైడ్రా.. మరో బిగ్ టాస్క్‌ చేపట్టింది. ఇక నుంచి నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లక్డీకాపూల్, రాజ్‌భవన్‌‌ ప్రాంతాల్లో ఆయన పర్యటించి పలు నాలాలను పరిశీలించారు. ఓ డ్రైన్‌ పూర్తిగా కూడుకుపోయి ఉండగా.. మరో డ్రైన్‌లో చెత్తాచెదారం పేరుకుపోయి కనిపించింది. దీంతో చాన్నాళ్ల క్రితం నుంచి ఈ పరిస్థితే ఉందనే అంచనాకు వచ్చారు రంగనాథ్‌. నగరవ్యాప్తంగా వరద నీటి ప్రవాహ వ్యవస్థను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఓ నివేదిక తయారు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. బాగా ట్రాఫిక్‌ జామ్ అవుతున్న ఏరియాల్లో ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపైనా రంగనాథ్ ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. 

Also Read :   'మెకానిక్ రాకీ' ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. స్టైలిష్ లుక్ లో మాస్ కా దాస్

సరైన వరద ప్రవాహ వ్యవస్థ లేకపోవడం..

ఈ మేరకు పది నిమిషాలు వర్షం పడితే మునగడం, రోడ్లన్నీ చెరువుల్లా మారుతున్న ప్రాంతాలపై హైడ్రా ఫోకస్ చేయనుంది. ఈ సమస్యలకు ప్రధాన కారణం సరైన వరద ప్రవాహ వ్యవస్థ లేకపోవడంతో పాటు నాలాలు, స్ట్రామ్‌ వాటర్‌ డ్రైన్లలో వ్యర్థాలు తొలగించకపోవడమేనని హైడ్రా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే నాలాలపై దృష్టి పెట్టారు. నాలాలపై ఉన్న ఆక్రమణను తొలగించి, కొత్త నిర్మాణాలను అడ్డుకోగలిగితే వరదల నుంచి హైదరాబాద్‌ని సేవ్ చేసినట్టేనని అధికారులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఏపీలో ఊహించని రాజకీయ పరిణామం.. రాజీకీ వచ్చిన జగన్, షర్మిల !

1302 కిలోమీటర్ల మేర వరద..

గ్రేటర్‌లో 1302 కిలోమీటర్ల మేర వరద ప్రవాహ వ్యవస్థ ఉంది. వీటిల్లో వ్యర్థాలను తొలగించేందుకు ఏటా 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కానీ డ్రైన్‌ల దుస్థితి మాత్రం అలానే ఉంటుంది. ఈ నేపథ్యంలో అసలు పూడికతీత జరుగుతోందా..? లేదా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నిచోట్ల డ్రైన్‌లు పూర్తిగా పాడైనా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇతర ప్రాంతాల్లోనూ మైనర్‌ డ్రైన్‌లు ఎలా ఉన్నాయన్నది పరిశీలించేందుకు హైడ్రా, జీహెచ్‌ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు పూడికతీత పేరిట ఎంత ఖర్చు చేశారు..? ఎంత మేర వ్యర్థాలు తొలగించారు..? అన్నదీ పరిశీలించే అవకాశముంది. కాగా, గతంలో పూడిక తీయకుండానే తీసినట్టు చూపి బిల్లులు చెల్లించినట్టు గుర్తించారు. ఈ విషయంలో పలువురు ఇంజనీర్లు, కాంట్రాక్టర్లపై కేసులు నమోదైనప్పటికీ అధికారుల తీరు మారలేదు. అయితే ఇప్పుడు రంగనాథ్ ఎంట్రీతో పరిస్థితి మారే అవకాశం కనిపిస్తోంది. 

ఇది కూడా చదవండి: కలెక్టర్ల పనితీరుపై సీఎం రేవంత్ వద్ద రిపోర్టు.. వాళ్లపై సీరియస్

Also Read :  గ్రూప్-1 పరీక్ష కేంద్రం వద్ద ప్రమాదం

Advertisment
Advertisment
తాజా కథనాలు