/rtv/media/media_files/2025/01/26/NIi2zFnQmOzynylfFEEm.jpg)
cock action Photograph: (cock action)
వేలంపాటలో కోడి దక్కించుకున్న వ్యక్తి అందిరిని పిలిచి పందెంకోడికి ఘనంగా సన్మానం చేశాడు. ప్రెస్‌మీట్ పెట్టి మరి శాలువాతో సన్మానించాడు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి. జనవరి 12న సంక్రాంతి సందర్భంగా మొయినాబాద్ పీఎస్ పరిధిలోని అజీజ్‌నగర్ పోచయ్యతోటలో కోడిపందేలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో ఎస్ఓటీ పోలీసులు రైడ్ చేశారు. పందేం నడుపుతున్న 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇది కూడా చూడండి: Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆ నెయ్యి తింటే అంతే.. షాకింగ్ వీడియో!
వారి దగ్గర నుంచి రూ.10వేల నగదు, 12 కోడికత్తులు, 5 బైక్‌లు, 6 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు. ఈ కోడిని రాజేంద్రనగర్ కోర్టులో వేలంకు పెట్టారు. జడ్జి సమక్షంలో వేలం వేయగా.. రూ.2,500 లకు పందెం కోడి వేలంపాటలో పోయింది. తెలంగాణ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామకృష్ణ కోడిని సొంతం చేసుకున్నారు. కోడిని దక్కించుకున్న ఆనందంలో ఆయన దానికి సన్మానం చేసి ప్రెస్‌మీట్ పెట్టారు. కోడిని వేలంలో దక్కించుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు.
ఇది కూడా చూడండి: Republic Day Celebrations: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మోదీ, చంద్రబాబు, రేవంత్- PHOTOS