/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-15-18-jpg.webp)
హైదరాబాద్ లో ఎక్కడకు వెళ్ళాలన్నా గంటలు గంటలు అవుతుంది. చాలా ముందుగా బయలుదేరితే కానీ అనుకున్న సమయానికి చేరుకోలేము. ఆఫీసులకు వెళ్ళేవారి కష్టాలైతే ఇక చెప్పనే అక్కర్లేదు. ఏ ప్రాంతంలో చూసినా ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుంది. రోడ్లు వెడల్పు చేసినా, ఫ్లైఓవర్లు కట్టినా కూడా ఈ బాధలు తప్పలేదు. కానీ ఇప్పుడు ఈ కష్టాలకు సీఎం రేవంత్ స్వస్తి పలకాలని చెప్పారు. దీనికి సంబంధించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
నగరంలో లింకు రోడ్లు..
హైదరాబాద్ మొత్తంలో లింకు రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా రోడ్ల నిర్మాణం ఉండాలన్నారు. అందుకు అవసరమైన భూసేకరణ చేపట్టాలని సూచించారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రహదారుల నిర్మాణం ఉండాలన్నారు. హెచ్ఎండీఏ పరిధిలో హైదరాబాద్ రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న రహదారుల నిర్మాణం, విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హెచ్ఎండీఏ పరిధిలో 49 రోడ్ల నిర్మాణం, విస్తరణపై సీఎం అధికారులకు కీలక సూచనలు చేసారు. దీనికి తోడు అవసరమైన చోట కొత్త రహదారులు, అండర్‌పాసులు, ఫ్లైఓవర్లు నిర్మిస్తోంది. అప్పటికే కొన్ని అందుబాటులోకి రాగా.. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి.
today-latest-news-in-telugu | traffic | CM Revanth
ఇది కూడా చూడండి: Ugadi 2025 Tv Offers: ఉగాది స్పెషల్.. బ్రాండెడ్ 4k TVలపై బ్లాక్ బస్టర్ ఆఫర్లు- వదిలారో మళ్లీ దొరకవ్!