/rtv/media/media_files/2025/09/07/chicken-shopes-2025-09-07-09-40-26.jpg)
తెలంగాణలో చికెన్ ప్రియులకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్. పౌల్ట్రీ కంపెనీలు ఇస్తున్న అతి తక్కువ లాభాల మార్జిన్‌పై నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులను మూసివేయాలని(chicken-shops-closed) వ్యాపారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ బంద్ వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటికే హైదరాబాద్(hyderabad) లోని ఉప్పల్, ఎల్బీనగర్ వంటి కీలక ప్రాంతాల్లో చికెన్ షాపుల ముందు బంద్‌కు సంబంధించిన పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. తక్కువ మార్జిన్‌తో వ్యాపారం చేయడం అసాధ్యమని, పౌల్ట్రీ కంపెనీలు ఏకపక్షంగా ధరలు నిర్ణయించడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నెల రోజుల క్రితం గ్యాస్ కొరత.. నిన్నటి నుంచి పెట్రోల్ కొరత.. నేడు చికెన్ కొరత వచ్చేలా ఉంది..
— News Now SamacharaM (@Now_SamacharaM) March 25, 2026
ఏప్రిల్-1 నుంచి చికెన్ షాపులు బంద్!
తెలంగాణలో ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులను మూసివేస్తున్నట్లు చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ తెలిపినట్లు ఉప్పల్, ఎల్బీనగర్ పలుచోట్ల చికెన్ వ్యాపారులు… pic.twitter.com/vdeCS2e9Vq
Also Read : రేవంత్ నువ్వే నా మీద పోటీ చేయ్ .. హరీష్ సవాల్!
రోజువారీ ఖర్చులు కూడా
గత కొంతకాలంగా కోళ్ల మేత ఖర్చులు, రవాణా వ్యయాలు భారీగా పెరిగినా, తమకు ఇచ్చే కమీషన్ మాత్రం గణనీయంగా తగ్గించారని వ్యాపార సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనివల్ల రోజువారీ ఖర్చులు కూడా వెళ్లడం లేదని, అనేక షాపులు నష్టాల్లో నడుస్తున్నాయని వారు చెబుతున్నారు. తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఈ బంద్‌కు పిలుపునిస్తూ, సమస్య పరిష్కారం అయ్యే వరకు షాపులు తెరిచే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని పౌల్ట్రీ కంపెనీలతో చర్చలు జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు ఈ బంద్ ప్రభావం సామాన్య వినియోగదారులపై తీవ్రంగా పడే అవకాశం ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ పరిస్థితుల వల్ల గ్యాస్, పెట్రోల్ ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బందులు పడుతుంటే, ఇప్పుడు చికెన్ సరఫరా కూడా నిలిచిపోతే ధరలు మరింత ఆకాశాన్ని తాకవచ్చు. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు ఈ బంద్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ ప్రభుత్వం త్వరగా స్పందించి ఈ వివాదాన్ని పరిష్కరించకపోతే, రాబోయే రోజుల్లో ఈ ఆందోళనలు మరింత ఉధృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా ప్రస్తుతం కిలో చికెన్ రూ.360 నుంచి రూ. 370 ఉంది.
Also Read : కాంగ్రెస్‌కు బిగ్‌షాక్.. జీవన్ రెడ్డి రాజీనామా
Follow Us