BIG BREAKING : ఊడిపడ్డ చార్మినార్ పెచ్చులు.. పరుగులు తీసిన జనం

చారిత్రాత్మక కట్టడం చార్మినార్ పెచ్చులు ఊడిపడ్డాయి. నాలుగు మినార్‌లలో భాగ్యలక్ష్మీ ఆలయం వైపు ఉన్న మినార్‌ నుంచి పెచ్చులు ఊడి ఆలయంపై పడ్డాయి. దీంతో అక్కడున్న పర్యాటకులు భయంతో పరుగులు తీశారు. హైదరాబాద్‌లో గురువారం భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే.

New Update
Charminar Shells

Charminar Shells Photograph: (Charminar Shells)

హైదరాబాద్‌లో గురువారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం నమోదైంది. వర్షం ధాటికి భాగ్యనగరం అతలాకుతలమైంది. పురాతనకట్టడమైన చార్మినార్ పెచ్చులు ఊడి కింద పడ్డాయి. చార్మినార్‌కు ఉన్న నాలుగు మినార్‌లలో భాగ్యలక్ష్మీ ఆలయం వైపు ఉన్న మినార్‌ నుంచి ఆలయంపై శిథిలాలు పడ్డాయి. దీంతో అక్కడున్న పర్యాటకులు భయంతో పరుగులు తీశారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని.. శిథిలాలను పరిశీలిస్తున్నారు.

Also read: Hyderabad Rain: గంట వానకే హైదరాబాద్ ఆగమాగం.. కూలిన చెట్లు, చెరువులుగా రోడ్లు.. వీడియోలు వైరల్!

గతంలోనే పెచ్చులు ఊడితే మరమ్మతులు అధికారులు చేశారు. అవే పెచ్చులుగా రాలాయని సమాచారం. అకరాల వర్షాల కారణంగా హైదరాబాద్‌లో అనేక వృక్షాలు నేలమట్టం అయ్యాయి. గురువారం(ఈరోజు) మధ్యాహ్నం నుంచి సిటీలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం ప్రయాణీకులతకు అంతరాయం కలిగిస్తోంది. కుతుబ్ షాహీ వంశానికి చెందిన ఐదవ పాలకుడు ముహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో చార్మినార్ నిర్మించాడు. 2010లో చార్మినార్‌ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చారు. ఇది ఓ పురాతన చారిత్రాత్మక నిర్మాణం.

Also : BIG BREAKING: HCU భూవివాదంలో సుప్రీం కోర్టు సీరియస్.. ‘ఏం జరిగినా పూర్తి బాధ్యత CS’

 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పాస్‌లు అమ్ముకుంటున్నారు.. హెచ్‌సీఏ మాజీ కార్యదర్శి ఫిర్యాదు

సన్‌రైజర్స్ హైదరాబాద్ హెచ్‌సీఏకు ఇస్తున్న ఐపీఎల్‌ కాంప్లిమెంటరీ పాస్‌లు అమ్ముతున్నారని హెచ్‌సీఏ మాజీ కార్యదర్శి శేష్‌నారాయణ ఆరోపించారు. ఈ క్రమంలో జనరల్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డికి శేష్‌నారాయణ బహిరంగ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.

New Update
 HCA vs SRH

HCA vs SRH

సన్‌రైజర్స్ హైదరాబాద్ హెచ్‌సీఏకు ఇస్తున్న ఐపీఎల్‌ కాంప్లిమెంటరీ పాస్‌లను ఇస్తోంది. అయితే అందులో కొన్ని పాస్‌లను ప్రైవేటు, ఇన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లు బ్లాక్‌లో అమ్ముకుంటున్నాయని హెచ్‌సీఏ మాజీ కార్యదర్శి శేష్‌నారాయణ ఆరోపించారు. ఎఫ్‌7 నుంచి ఎఫ్‌16 వరకు ఉన్న కార్పొరేట్‌ బాక్స్‌లను హెచ్‌సీఏలో ఉన్న కొందరు వ్యక్తులు పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. ఈ క్రమంలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డికి శేష్‌నారాయణ బహిరంగ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. కాంప్లిమెంటరీ పాస్‌లు, సన్‌రైజర్స్‌తో సంబంధాలు, హెచ్‌సీఏ పరిపాలన వ్యవహరాలపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.

ఇది కూడా చూడండి: Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?

అసలు వివాదం ఏంటంటే?

తమిళనాడుకు చెందిన సన్‌నెట్‌వర్క్ యాజమాన్యంలోని సన్‌రైజర్స్‌ ఫ్రాంచైజీ ఉన్న సంగతి తెలిసిందే. ఇది ఐపీఎల్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి హైదరాబాద్‌ను తమ హోమ్‌ గ్రౌండ్‌గా ఎంచుకొని ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచ్‌లో ఆడుతోంది. ఐపీఎల్‌ ఆడే సమయంలో ఉప్పల్‌ స్టేడియాన్ని రెంట్‌కు తీసుకుంటోంది. ఇందుకోసం ప్రతీ మ్యాచ్‌కు హెచ్‌సీఏకు రూ.కోటి చెల్లిస్తోంది.

ఇది కూడా చూడండి: PM Modi: వారిని మట్టిలో కలిపేస్తాం.. ఇక యుద్ధమే: మోదీ సంచలన ప్రకటన

మ్యాచ్ టికెట్ల విక్రయాలను కూడా సన్‌రైజర్స్‌ ఫ్రాంచైజీనే చూసుకుంటోంది. స్టేడియ కేపాసిటీ మొత్తం 39 వేలు. ఇందులో 10 శాతం అంటే 3900 టికెట్లను కాంప్లిమెంటరీ పాసుల రూపంలో SRH.. హెచ్‌సీఏకు ఫ్రీగా అందిస్తోంది. వీటిలో రూ.750 ధర టికెట్ల నుంచి రూ.20 వేలు విలువ చేసే కార్పొరేట్ బాక్స్‌ పాసులు కూడా ఉన్నాయి. ఈ కార్పొరేట్ బాక్స్‌ పాసుల విషయంలోనే సన్‌రైజర్స్‌కు, హెచ్‌సీఏకు మధ్య విభేదాలు వచ్చాయి.

ఇది కూడా చూడండి: Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?

ఉప్పల్‌ స్టేడియంలోని సౌత్‌ స్టాండ్‌ ఫస్ట్‌ఫ్లోర్‌లోని ఎఫ్‌-12ఏ బాక్స్‌లో గత పదేళ్ల నుంచి హెచ్‌సీఏకు 50 టికెట్లు కేటాయిస్తోంది. అయితే ఈ సీజన్‌లో మాత్రం ఆ బాక్స్‌ కెపాసిటీ 30 టికెట్లు మాత్రమే. దీంతో అదనంగా మరో 20 టికెట్లు ఇవ్వాలని SRHను HCA అడిగగా.. దీనికి ఎస్‌ఆర్‌హెచ్‌ నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎక్స్‌ట్రా టికెట్ల కోసం HCA బెదిరించిందని SRH ఆరోపిస్తోంది. గత రెండేళ్లుగా ఇలాంటి సమస్యలు కొనసాగుతున్నాయని, ఇక సహించలేమని SRH.. HCA ట్రెజరీకి మెయిల్ చేసిందన్న వార్తలు వచ్చాయి.

Advertisment
Advertisment
Advertisment