HYD: ఇవాళ ఏసీబీ ముందుకు కేటీఆర్

ఫార్ములా-ఈ రేసు కేసులో బీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు విచారణకు హాజరుకానున్నారు. తన న్యాయవాదితో కలిసి విచారణకు వెళ్ళనున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్, హరీష్ రావు ఇళ్ళ ముదు ఫుల్ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.

New Update

 అరవింద్, దానకిశోర్ స్టేట్మెంట్స్ ఆధారంగా.. ఈరోజు ఏసీబీ అధికారులు బీఆర్ఎస్ నేత కేటీఆర్‌ను
విచారించనున్నారు. ఫార్మలా ఈ రేసు విషయంలో బిజినెస్ రూల్స్ ఉల్లంఘన, నిధుల దుర్వినియోగం చేశారన్న ఆరోపణలను కేటీఆర్ ఎదుర్కొంటున్నారు. దాంతో పాటూ కార్ రేసు కోసం ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లించడంపై కూడా ఏసీబీ ప్రశ్నిస్తారని తెలుస్తోంది. అలాగే కోడ్ ఉల్లంఘనపై కూడా కేటీఆర్‌ను ప్రశ్నలు అడుగుతారని తెలుస్తోంది. విచారణ నేపథ్యంలో మాజీమంత్రి హరీష్ రావు గృహ నిర్బంధం చేయనున్నారు. దాంతో పాటూ హరీష్ రావు ఇంటి దగ్గర భారీగా పోలీసుల బందోబస్తునే ఏర్పాటు చేయనున్నారు. 

లాయర్‌‌తో విచారణకు..

విచారణకు కేటీఆర్ తన లాయర్‌‌తో రానున్నారు. దీనికి సంబంధించి కేటీఆర్ కు హైకోర్టులో స్వల్ప ఊరట లబించింది. సీసీ టీవీ పర్యవేక్షణలో విచారణ జరపాలని ఆదేశించింది. విచారణ జరుగుతున్న సమయంలో లాయర్ లైబ్రరీ రూంలో కూర్చునేందుకు అనుమతి ఇచ్చింది. విచారణ జరుగుతున్న గదిలోకి లాయర్ కు అనుమతి ఉండదని న్యాయస్థానం స్పష్టం చేసింది. విచారణ విషయంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే కోర్టుకు రావచ్చునని కేటీఆర్ కు ధర్మాసనం సూచించింది.

అంతకు ముందు ఏసీబీ విచారణకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హాజరయ్యారు. అందులో ఆయన కేటీఆర్ ఆదేశాలతోనే నగదు రిలీజ్ చేశానని స్పష్టం చేసినట్లు సమాచారం.కేబినెట్ అనుమతి లేకుండా ఎందుకు రిలీజ్ చేశారని ఏసీబీ అధికారుల ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.  గ్రీన్‌కో స్పాన్సర్‌షిప్‌ నుంచి వైదొలడానికి కారణం ఏంటని కూడా అడిగినట్లు సమాచారం. అరవింద్ కుమార్ స్టేట్‌మెంట్ ను ఏసీబీ రికార్డు చేసింది. అరవింద్ కుమార్ చెప్పిన సమాధానాల ఆధారంగా కేటీఆర్ ను విచారించనున్నట్లు తెలుస్తోంది. 

Also Read: TTD: ప్రభుత్వ వైఫల్యమే తొక్కిసలాటకు దారితీసింది: భూమన కరుణాకర్‌రెడ్డి
 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు