/rtv/media/media_files/2025/02/05/1NL4DRmM6Jtts26bCFjh.jpg)
10th student suicide
కాలం మారిందో, పెంపకం మారిందో తెలియదు కానీ...ఇప్పటి పిల్లలు చాలా సున్నితంగా తయారవుతున్నారు. తిట్టినా, మందలించినా కూడా ఓర్చుకోలేక పోతున్నారు. ప్రతీ దానికీ చావే పరిష్కారం అన్నట్టు తయారవుతున్నారు. తాము ఆడిందే ఆట, పాడిందే ఫాట అయితే ఓకే..ఏ కొంచెం తేడా వచ్చినా ఆత్మహత్యల వరకూ వెళ్ళిపోతున్నారు. తాజాగా హైదరాబాద్ కు దగ్గరలో ఉన్న షాద్ నగర్ లో ఇటువంటి సంఘటనే జరిగింది. అక్కడ ఓ పాఠశాల భవనం పై నుండి దూకి పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇది కూడా చదవండి: PMGKAY: ట్యాక్స్ పేయర్లకు బిగ్ షాక్.. ప్రభుత్వ పథకాలు బంద్!
స్కూల్ బిల్డింగ్ పై నుంచి దూకి..
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని శాస్త్ర స్కూల్ భవనం పై నుండి అదే పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న నీరజ్ అనే విద్యార్థి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బిజెపి షాద్ నగర్ పట్టణ అధ్యక్షుడు హరి భూషణ్ కుమారుడు నీరజ్. ఇతను పదవ తరగతి చుదువుతున్నాడు. నీరజ్ మల్లికార్జున కాలనీకి చెందిన మరో విద్యార్థి బాల్కనీలో సాయంత్రం సమయంలో ఏదో మాట్లాడుతుండగా..ప్రిన్సిపల్ ఇరువురిని తన గదిలోకి పిలిచి తీవ్రంగా మందలించినట్లు తెలుస్తోంది. దీంతో మనస్థాపానికి గురైన నీరజ్ టాయిలెట్ కోసం వెళ్తున్నట్లు చెప్పి అక్కడే భవనం పైకి ఎక్కి మొదటి అంతస్తు నుండి దూకాడు. బిల్డింగ్ పై నుండి కింద పడిన నీరజ్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. నీరజ్ పడిపోవడాన్ని గమనించిన స్కూల్ యాజమాన్యం అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించింది. అక్కడ చికిత్స అందిస్తుండగా నీరజ్ చనిపోయాడు. అతను పడిపోయి దృశ్యాలు స్కూల్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
Also Read: USA: హెచ్ 1 బీ ఆటో రెన్యువల్ రద్దు చేస్తారా?