Hyderabad: బిగ్ అలర్ట్.. వారం రోజుల పాటు ఆ ఫ్లైఓవర్ మూసివేత..!

హైదరాబాద్ లోని వాహనదారులకు ట్రాఫిక్ అధికారులు ఓ ముఖ్య హెచ్చరికను జారీ చేశారు.నిత్యం రద్దీగా ఉండే గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ను వారం రోజుల పాటు మూసివేయనున్నట్టు తెలిపారు.

New Update
Traffic Restrictions : నేడు బక్రీద్‌..హైదరాబాద్‌ లో ఈ ఏరియాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు!

Hyderabad: హైదరాబాద్ లోని వాహనదారులకు ట్రాఫిక్ అధికారులు ఓ ముఖ్య హెచ్చరికను జారీ చేశారు. న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించ‌నున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో... నిత్యం రద్దీగా ఉండే గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ను వారం రోజుల పాటు మూసివేయనున్నట్టు తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎస్‌ఆర్‌డీపీ పనుల్లో భాగంగా శిల్పా లేఅవుట్‌ ఫేజ్‌-2 ప్రాంతంలో ఫ్లై ఓవర్‌ నిర్మాణం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే మంగళవారం నుంచి 28వ తేదీ వరకు రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ జోయెల్‌ డేవీస్ చెప్పారు.

Also Read:  100 కి.మీ వేగంతో గాలులు..ఆ రెండు జిల్లాలకు అలర్ట్‌!

ఈ నేపథ్యంలో.. నిర్ణీత సమయంలో గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ను మూసి వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.ఆ మార్గం గుండా ప్రయాణాలు సాగించే వాహ‌న‌దారులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఎస్‌ఆర్‌డీపీ పనులలో భాగంగా గత కొంత కాలంగా శిల్పా లేఅవుట్‌ ఫేజ్‌-2 ప్రాంతంలో ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

Also Read: అందుకే షర్మిలపై జగన్ పిటిషన్... YCP సంచలన ట్వీట్!

వారం రోజుల పాటు...

అయితే.. మిగతా సమయంలో వాహనాలు రాకపోకలు సాగించే అవకాశం ఉంది. అయితే.. రాత్రి 11 గంటల తర్వాత ప్రయాణాలు సాగించే వారు ఈ వారం రోజుల పాటు... ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు.అయితే.. బయోడైవర్సిటీ జంక్షన్‌ నుంచి ఐఐఐటీ జంక్షన్‌ వైపు వెళ్లే వాహనదారులు గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ బైపాస్‌ చేస్తూ బిచ్చారెడ్డి స్వీట్స్‌ నుంచి గచ్చిబౌలి జంక్షన్‌ మీదుగా ఐఐఐటీ జంక్షన్‌కు చేరుకునేలా ట్రాఫిక్‌ను మళ్లీస్తున్నారు. 

Also Read:  ఇక చెట్ల పరిరక్షణ ధ్యేయం‌‌–హైడ్రా రంగనాథ్

మరోపక్క.. ఐఐఐటీ జంక్షన్‌ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్‌కు వెళ్లే వాహనదారులు గచ్చిబౌలి జంక్షన్‌ పక్క నుంచి బయోడైవర్సిటీ జంక్షన్‌కు చేరుకునే వీలు కల్పించారు. ఈ ట్రాఫిక్ మళ్లింపులను దృష్టిలో పెట్టుకుని వాహనదారులు తమ గమ్యస్థానాలకు సులభంగా, సురక్షితంగా చేరుకోవాలని అధికారులు చెప్పారు.

Also Read: కేఏపాల్ హైకోర్టులో వాదనలు..హైడ్రాకు కీలక ఆదేశాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు