/rtv/media/media_files/2025/03/06/HJAqpqyMIMN9msRkKXj5.jpg)
Jubliee Hills Photograph: (Jubliee Hills)
జలమండలి సరఫరా చేసే తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించిన వ్యక్తికి అధికారులు జరిమానా విధించారు. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ ప్రధాన రహదారిపై వెళుతుండగా రోడ్ నం.78 లో నీరు లీకేజీ అయినట్లు గమనించాడు. ఈ క్రమంలో లీకేజీకి గల కారణాలను ఆరా తియ్యమని అధికారులను ఆదేశించాడు.
ఇది కూడా చూడండి: Agent OTT Date: హమ్మయ్య.. రెండేళ్ల తర్వాత OTTలోకి అయ్యగారి సినిమా.. అక్కినేని ఫ్యాన్స్ సంబరాలు!
తాగునీటితో బైక్ క్లీనింగ్... వ్యక్తికి జరిమానా
— HMWSSB (@HMWSSBOnline) March 5, 2025
====================
# ఎవరైనా ఇలా చేస్తే చర్యలు తీసుకుంటామని ఎండీ హెచ్చరిక
జలమండలి సరఫరా చేసే తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించిన వ్యక్తికి అధికారులు జరిమానా విధించారు. ఈ ఘటన జూబ్లీహిల్స్ లో జరిగింది.
జలమండలి ఎండీ అశోక్ రెడ్డి… pic.twitter.com/VVOjD66UIB
ఇది కూడా చూడండి: Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో భారత్ vs న్యూజిలాండ్..దక్షిణాఫ్రికా ఇంటికి..
ఇతర అవసరాలకు వినియోగిస్తే..
ఈ క్రమంలో అండ్ డివిజన్ జీఎం హరిశంకర్ స్థానిక మేనేజర్‌తో వెళ్లి ఘటనను పరిశీలించగా.. అక్కడ ఓ వ్యక్తి ఆ తాగు నీటితో బైక్ కడుగుతున్నాడు. ఈ విషయాన్ని ఎండీకి చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగు నీటిని ఇలా ఇతర అవసరాలకు ఉపయోగించడంతో అతనికి జరిమానా రూ.1000 జరిమానా విధించారు. జలమండలి సరఫరా చేసే తాగునీరు ఇలా ఇతర అవసరాలకు వినియోగించవద్దని ఎండీ విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఇది కూడా చూడండి: Railway Jobs: రైల్వేలో మరో 835 పోస్టులు.. త్వరగా దరఖాస్తు చేసుకోండి!
జలమండలి దూర ప్రాంతాల నుంచి నీటిని శుద్ధి చేసి సరఫరా చేస్తుంది. ఇలాంటి తాగు నీటిని వృథా చేయకుండా వాటిని అవసరాలకు మాత్రమే వినియోగించాలని కోరారు. వేసవి కాలం దగ్గర పడటంతో.. ఇప్పటికే నగరంలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఇంకో రెండు నెలలో నీటికి కొరత ఏర్పడుతుంది. కాబట్టి నగర ప్రజలు తాగునీటికై సరఫరా చేసే శుద్ధమైన నీటిని వృధా చేయకూడని విజ్ఞప్తి చేశారు.