హైదరాబాద్‌లో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. గచ్చిబౌలి ప్లైఓవర్‌పై ఆర్టీసీ బస్సు ఓ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు టైర్ల కిందపడి పదవ తరగతి విద్యార్థి చనిపోయింది. పరీక్ష రాసి తన అన్నతో కలిసి బైక్ మీద లింగంపల్లి వైపు వెళ్తుంది. ఈ క్రమంలో యాక్సిడెంట్ జరగడంతో చెల్లి మృతి చెందగా.. అన్న తీవ్రంగా గాయపడ్డాడు. ఇతన్ని వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం..
ఇదిలా ఉండగా ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శిరావనేలోని మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడుతున్నాయి. దట్టమైన నల్లటి పొగ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టేసింది.
ఇది కూడా చూడండి: నీ మొగుడ్ని వదిలేసి రా.. హైదరాబాద్ మహిళకు ఎన్ఆర్ఐ వేధింపులు
ప్రజలు భయంతో గజగజ వణికిపోతున్నారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారాన్నిఅందించగా సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అందులో భారీ పొగలు ఎగసిపడుతున్నట్లు కనిపిస్తుంది.
ఈ ప్రమాదంపై అగ్నిమాపక అధికారి ఎస్ఎల్ పాటిల్ మాట్లాడుతూ.. ‘‘ సంఘటనా స్థలంలో పన్నెండు అగ్నిమాపక యంత్రాలు ఉన్నాయి. వీలైనంత త్వరగా మంటలను అదుపు చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము. ఎవరూ గాయపడలేదు. మంటలకు గల కారణం ఇంకా తెలియరాలేదు’’ అని తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చూడండి: Contaminated Food: ప్రాణాలు తీస్తున్న కలుషిత ఆహారం.. అందుకే వండిన వెంటనే తినేయాలి