TG Crime: భాగ్యనగర్ ప్రజలలో హై టెన్షన్ నెలకొంది. వరుస మర్డర్లతో హైదరాబాద్ వాసులు గజగజ వణుకుతున్నారు. చంపాపేట పరిధి అంబేడ్కర్ వాడలో అడ్వొకేట్ హత్యకు గురైన విషయం తెలిసిందే. న్యాయవాది ఇజ్రాయెల్‌ను కత్తులతో పొడిచి దారుణంగా చంపారు గుర్తు తెలియని దుండగులు. ఈ విషయం ఇలా ఉంటే తాజాగా హైదరాబాద్‌లో మరో దారుణ హత్య చోటు చేసుకుంది. గాంధీ భవన్ దగ్గర నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ సమీపంలో ఉన్న మనోరంజన్ కాంప్లెక్స్ వెనుక గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది.
బండరాళ్లతో కొట్టి చంపినట్టు గుర్తులు..
ఓ వ్యక్తిని బండరాళ్లతో కొట్టి చంపినట్టు గుర్తులు ఉన్నాయి. మృతి చెందిన వ్యక్తి 25 సంవత్సరాలు ఉన్నట్లు సమాచారం. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. దాడిపై మరింత సమాచారం కోసం చుట్టు పక్కన ఉన్న సీసీ కెమెరాలను తనిఖీ చేశారు.
హైదరాబాద్‌లో మరో దారుణ హత్య
— Telugu Scribe (@TeluguScribe) March 24, 2025
హైదరాబాద్ - గాంధీ భవన్, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ సమీపంలోని మనోరంజన్ కాంప్లెక్స్ వెనుక ఒక గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు
బండరాళ్లతో కొట్టి చంపినట్టు నిర్ధారణ
ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు pic.twitter.com/vuBTcvTulG
యువకుడి మృతదేహంపై తీవ్ర గాయాలు ఉండటంతో.. గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో కొట్టి చంపినట్లు పోలీసులు నిర్దారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హత్య ఎలా జరిగింది అనే విషయంపై దర్యాప్తు చేసి త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: బంగారం ధరించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
(ts-crime | ts-crime-news | latest-news)