BREAKING: HCU భూముల అమ్మకంపై యూనివర్సిటీ కీలక ప్రకటన

HCU భూముల అమ్మకంపై మొదటిసారి యూనివర్సిటీ యాజమాన్యం స్పందించింది. వర్సిటీకి కేటాయించిన భూములు అమ్మాలంటే ఎగ్జిక్యూటి కమిటీ వేయాల్సిందే యాజమాన్యం తెలిపింది.

New Update
HCU pressnote

HCU pressnote

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకంపై మొదటిసారి యూనివర్సిటీ యాజమాన్యం స్పందించింది. ఈ మేరకు HCU అధికారిక ప్రకటన విడుదల చేసింది. వర్సిటీకి కేటాయించిన భూములను వేలం వేయాలన్నా, అమ్మాలనన్నా ఎగ్జిక్యూటి కమిటీ వేయాల్సిందే అని హెచ్సీయూ తెలిపింది. గచ్చిబౌలి దగ్గరున్న 400 ఎకరాల భూములను తెలంగాణ సర్కార్ అమ్మకానికి సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే.

TGIIC ప్రకటనను హెచ్చ్సీయూ యాజమాన్యం ఖండించింది. 2024 జూలైలో యూనివర్సిటీ భూములపై సర్వే జరగలేదని యాజమాన్యం తేల్చి చెప్పింది. ఇప్పటి వరకూ కేవలం ప్రాథమికంగా పరిశీలన మాత్రమే జరిగిందని యూనివర్సిటీ వెల్లడించింది. HCU భూములు అమ్మడానికి తాము అంగీకరించలేదని యూనివర్సిటీ యాజమాన్యం చెప్పుకొచ్చింది. అలాగే యూనివర్సిటీ భూముల హద్దులను నిర్ణయించడానిక యాజమాన్యం అంగీకరించలేదని ప్రకటనలో పేర్కొంది. ఆ ప్రాంతం పర్యావరణం, జీవవైవిద్యాన్ని పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు HCU తెలిపింది.

Also read: ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం.. కాకనాడ పోర్టుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

అయితే అటు 400 ఎకరాలు మాత్రం హెచ్సీయూకు సంబంధం లేదని తెలంగాణ ప్రభుత్వం అంటోంది. ఆ భూములు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందినవి TGIIC చెబుతోంది. ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు లేవని ఆ సంస్థ స్పష్టం చేసింది. ఓ ప్రైవేటు సంస్థకు 21 ఏళ్ల క్రితం కేటాయించిన భూమిని న్యాయ పోరాటం ద్వారా దక్కించుకున్నట్లు వెల్లడించింది. వేలం, అభివృద్ధి పనులు అక్కడి రాళ్లను దెబ్బ తీయవని తెలిపింది. అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువు లేదని సర్వేలో ఒక్క అంగుళం భూమి కూడా హెచ్‌సియుది కాదని పేర్కొంది. కొందరు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పుకొచ్చింది.

Also read: Fire accident: ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. అందులోనే 15 మంది కార్మికులు

Advertisment
Advertisment
Advertisment