BC Reservation In Local Bodies: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు ఇంకెంత కాలం ?  సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ..

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడానికి ఇంకెంత కాలం తాత్సారం చేస్తారని సీఏం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఇంకా అమలు చేయకపోవడం శోచనీయమంటూ సీఎంకు బహిరంగ లేఖ రాశారు.

New Update
Brs Mlc Kavitha

Brs Mlc Kavitha

BC Reservation In Local Bodies: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడానికి ఇంకెంత కాలం తాత్సారం చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కులగణన పూర్తి చేసి రిజర్వేషన్లు పెంచుతామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇంకా అమలు చేయకపోవడం శోచనీయమన్నారు.ఈ మేరకు గురువారం నాడు ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) బహిరంగ లేఖ రాశారు.

Also Read: భార్యను గోడకేసి కొట్టి.. మటన్ కత్తితో ముక్కలుగా నరికి.. కుక్కర్ క్రైమ్ స్టోరీలో విస్తుపోయే నిజాలు

ఎమ్మెల్సీ కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ

బీసీలకు ఏటా రూ. 20 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చి 2024-25 బడ్జెట్ లో అరకొర కేటాయింపులు చేసి తొలి ఏడాదే కామారెడ్డి డిక్లరేషన్ ను సీఎం రేవంత్ రెడ్డి ఉల్లంఘించారని విమర్శించారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల బీసీ వర్గాల్లో ఏ మాత్రం విశ్వాసం లేదని, ఈ వైఖరితో రాష్ట్రంలో బీసీలంతా తీరని అన్యాయానికి గురవుతున్నారని పేర్కొన్నారు.

“కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రధాన హామీ అయిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు(BC) 42 శాతం రిజర్వేషన్లను కల్పించడం. “కుల గణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీలకు రిజర్వేషన్ల పెంపు” అని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో స్పష్టంగా పేర్కొని ఉంది. 6 నెలలు గడిచాయి... ఏడాది గడిచింది.. అయినా కూడా రిజర్వేషన్ల పెంపునకు అతీగతీ లేదు. అశాస్త్రీయంగా బీసీ గణన నిర్వహించి, డెడికేటెడ్ కమిషన్ పేరిట కాలయాపన చేయడమే మీ ఆలోచనగా కనిపిస్తోంది.” అని తెలిపారు.  

Also Read: Stock Market Today: లాభాల్లో  ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..రికార్డ్ స్థాయిలో బంగారం ధర

కుల గణన పూర్తయ్యి కూడా చాలా కాలం అవుతుందని, కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఆ వివరాలను బహీర్గతం చేయలేదని ఎండగట్టారు. ఆ వివరాలను తక్షణమే బహీర్గతం చేయాల్సిన అవసరం ఉందని, డెడికేటెడ్ కమిషన్ నివేదిక సిద్ధమైనట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. “ బీసీల అంశాల పట్ల మీ ప్రభుత్వం ఎందుకు అంత నిర్లక్ష్యం వహిస్తోంది ? బీసీలంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు చులకన ? 6 నెలల్లోపే అమలు చేస్తామన్న హామీ 12 నెలలు గడిచినా ఎందుకు అమలు చేయడం లేదు ? హామీని అమలు చేయడానికి ఇంకెంత కాలం పడుతుంది ?” అని ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పదవీకాలం ముగిసి దాదాపు ఏడాది పూర్తయ్యిందని, మండల, జిల్లా పరిషత్ ల పదవీకాలం కూడా ముగిసిందని,  ప్రస్తుతం గ్రామాల్లో ప్రజా పాలన కాకుండా ప్రత్యేకాధికారుల పాలన సాగుతోందని వివరించారు. కానీ మీ ప్రభుత్వానికి త్వరగా రిజర్వేషన్లను పెంచి ఎన్నికలను నిర్వహించాలన్న సోయి లేనట్లు అర్థమవుతోందని అనుమానం వ్యక్తం చేశారు.

Also Read: ప్రభుత్వం గుడ్ న్యూస్.. విప్రోలో 5000 ఉద్యోగాలు

బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాల్సిందేనని తేల్చిచెప్పారు. కుంటి సాకులు చెప్పి ఇచ్చిన మాట కంటే తక్కువ రిజర్వేషన్లు కల్పిస్తే మాత్రం తెలంగాణ సమాజం మిమ్మల్ని సహించబోదని, బీసీల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీ మీ మెడలు వంచి హామీని అమలు చేయించుకుంటామని హెచ్చరించారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లను తక్షణమే 42 శాతానికి పెంచడానికి చర్యలను ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

Also Read :  GHMC విస్తరణ .. ఆ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వీలినం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు