/rtv/media/media_files/2024/12/10/6sXDsjV2h413uAkTJHHH.jpeg)
హైదరాబాద్‌లో రోజురోజుకు అభివృద్ధి పనులు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే రేవంత్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో మరో మూడు కొత్త స్కైవాక్‌లు నిర్మించనుంది. ఇందుకోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటికి పర్మిషన్ రాగానే పనులు ప్రారంభించనున్నారు. అల్విన్‌కాలనీ చౌరస్తా, మియాపూర్, ఆరాంఘర్ కూడళ్ల వద్ద కొత్తగా స్కై వాక్‌ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. అనుమతులు వచ్చాక వీటి నిర్మాణం జరగనుంది.
Also Read: ముంబైలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
అయితే హెచ్-సిటీలో భాగంగా ఇప్పటికే ఉప్పల్ కూడలిలో స్కైవాక్ అందుబాటులోకి వచ్చింది. మొత్తం రూ.25 కోట్ల వ్యయంతో రామంతాపూర్ రోడ్డు, నాగోల్, వరంగల్ రోడ్డు, మెట్టుగూడ మార్గాలతో పాటు ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు లింక్ చేస్తూ ఈ స్కైవాక్‌ను నిర్మించారు. దీనికి అన్నివైపులా మెట్లు, లిఫ్టులు ఏర్పాటు చేశారు. ఇక రహేజా మైండ్‌స్పేస్ ప్రాంగణంలో కూడా ఇలాంటి నిర్మాణం ప్రజలకు ఉపయోగకరంగా ఉంది. ఈ నేపథ్యంలోనే నగరంలో మరిన్ని స్కైవాక్‌లు అవసరమని జీహెచ్‌ఎంసీ ఇటీవలే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది.
Also Read: అమెరికాకు వెళ్లాలనుకునేవారికి షాక్.. భారీగా తగ్గిన వీసాలు
Skywalks In Hyderabad
ఇదిలాఉండగా.. మున్సిపల్ శాఖ హెచ్‌సిటీ ప్రాజెక్టు కింద రూ.5,942 కోట్ల అంచనా వ్యయంతో 23 పనులు చేపట్టాలని HMDAకు పర్మిషన్ ఇచ్చింది. మొదటగా 2 కూడళ్ల వద్ద.. గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ కూడలిలో రూ.459 కోట్లతో రెండు ఫ్లైఓవర్లు, రెండు అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు. అలాగే రూ.158 కోట్లతో విప్రో చౌరస్తాలో ఓ ఫ్లైఓవర్, ఐసీఐసీఐ చౌరస్తాలో అండర్‌పాస్ నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి కూడా పర్మిషన్ ఇచ్చింది.
Also Read: మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వలేము– సుప్రీంకోర్టు
హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌తో పాటు కొత్తగా ఫోర్త్ సిటీ నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. ఫోర్త్ సిటీ విషయంపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ప్రణాళికబద్ధమైన నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే వివిధ రంగాల హబ్‌లను అక్కడ ఏర్పాటు చేసేందుకు ప్రతిష్టాత్మక సంస్థలతో ఇప్పటికే చర్చించారు. ఫార్మా రంగంతో పాటు, ఏఐసీటీ ఇతర టెక్నాలజీ సిటీలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
Also Read: ఫుల్ గా మద్యం తాగించి దాడి.. లగచర్ల ఘటనలో బయటపడ్డ దారుణాలు!
Danam Nagender : కేసీఆర్ వరంగల్ సభ సక్సెస్ అవుతుంది.. దానం సంచలన కామెంట్స్
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ వరంగల్ సభ సక్సెస్ అవుతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ కోసం భారీగా జనం వస్తారని అన్నారు. మరోవైపు ఐపీఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ సబబే అని వెల్లడించారు.
danam nagender brs
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ వరంగల్ సభ సక్సెస్ అవుతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ కోసం భారీగా జనం వస్తారని అన్నారు. ఎప్పటినుండో కేసీఆర్ ను చూడ్డానికి జనం ఆశగా ఉన్నారని.. సభకు కూడా జనం బాగా వస్తారని తాను కూడా అనుకుంటున్నాని తెలిపారు. హిమాయత్ నగర్ కార్పొరేటర్ గడ్డం మహాలక్ష్మి రామన్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం నారాయణగూడ కమ్యూనిటీ హల్ లో జలమండలి, ఇతర అధికారులు, పారిశుద్ధ్య కార్మికులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఐపీఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ సబబే అని దానం వెల్లడించారు.
Also read : పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!
వ్యక్తిగతంగా బాధించింది
అయితే రాష్ట్ర సీఎస్ శాంతకుమారిపై సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడం తనను వ్యక్తిగతంగా బాధించిందన్నారు. శాంతకుమారికి మంచి అధికారిగా పేరు ఉందన్నారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేస్తోందని వెల్లడించారు. కాగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కేసీఆర్‌పై దానం అనుకూలంగా కామెంట్స్ చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. మళ్లీ దానం బీఆర్ఎస్‌లోకి వెళ్తారంటూ పోలిటికల్ సర్కిల్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన దానం ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Also Read : ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!
Mohammad Rizwan : పాక్ కెప్టెన్ ఓవరాక్షన్..ఇవే తగ్గించుకుంటే మంచిది!
🔴Pahalgam Terrorist Attack Live Updates: కశ్మీర్ లో ఉగ్రవాదుల వేట.. లైవ్ అప్డేట్స్!
Rajamouli: మహేష్ బాబు కోసం RTO ఆఫీస్ కి రాజమౌళి.. వీడియో వైరల్
Pahalgam Terror Attack: ఈ దారుణాన్ని దేశం మరిచిపోదు.. పవన్ భావోద్వేగం-PHOTOS
Duvvada Srinivas: థాంక్యూ జగన్.. సస్పెన్షన్ పై దువ్వాడ సంచలన వీడియో!