హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. నిజాంపేట, మాదాపూర్, జూబ్లిహిల్స్, మణికొండ, నార్సింగి, ఖైరతాబాద్, నాంపల్లి తదితర ప్రాంతాల్లో కుండపోత వాన కురిసింది. అనేక చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. నిజాంపేట, మాదాపూర్, జూబ్లిహిల్స్, మణికొండ, నార్సింగి, గండిపేట, ఖైరతాబాద్, నాంపల్లి, హైటెక్ సిటీ, బండ్లగూడ, కూకట్‌పల్లి, మూసాపేట, బాలానగర్, కొంపల్లి, గుండ్ల పోచంపల్లి, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో కుండపోత వాన కురిసింది. అనేక చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వీకెండ్ కావడంతో సాయంత్రం సరదాగ బయటకు వచ్చినవారు వానలో తడిసిముద్దమయ్యారు. రహదారులపై వర్షపు నీటిని మళ్లించేందుకు GHMC, DRF సిబ్బంది రంగంలోకి దిగారు.
ఏడురోజుల పాటు జపాన్‌లో పర్యటించిన సీఎం రేవంత్ బృందం కీలక ఒప్పందాల చేసుకుంది. మొత్తం రూ.12,062 కోట్ల పెట్టుబడులు సాధించింది. దీనిద్వారా తెలంగాణలో యువతకు 30,500 ఉద్యోగావకాశాలు లభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రైజింగ్ బృందం జపాన్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆ బృందం పలు కీలక ఒప్పందాలు చేసుకుంది. ఏడు రోజుల పర్యటనలో మొత్తం రూ.12,062 కోట్ల పెట్టుబడులు సాధించింది. దీనిద్వారా తెలంగాణలో యువతకు 30,500 ఉద్యోగావకాశాలు లభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు జపాన్‌కు చెందిన మారుబెని కంపెనీ ఒప్పందం చేసుకుంది. రూ.1000 కోట్ల ప్రారంభ పెట్టుబడి పెట్టనుంది.
మొత్తంగా రూ.5 వేల కోట్ల పెట్టుబడులకు అంచనా వేసింది. అలాగే NTT డేటా, నెయిసా సంస్థలతో కూడా తెలంగాణ సర్కార్ ఒప్పందం చేసుకుంది. ఈ కంపెనీలు మొత్తం రూ.10,500 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేయనున్నాయి. తోషిబా ట్రాన్స్‌మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా (TTDI)తో సైతం ఒప్పందం కుదిరింది. ఆ కంపెనీ రూ.562 కోట్లతో రుద్రారంలోని విద్యుత్ పరికరాలు, సామగ్రి తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది.
ఈ కంపెనీల ద్వారా దాదాపు యువతకు 30,500 ఉద్యోగాలు రానున్నాయి. తెలంగాణ సర్కార్ ఆధ్వర్యంలో టామ్ కామ్‌తో టెర్న్, రాజ్ గ్రూప్‌లు చేసుకున్న ఒప్పందాలు వల్ల రాష్ట్రానికి చెందిన 500 మందికి జపాన్‌లో ఉద్యోగ నియామకాలకు మార్గం సుగమమైంది. ఇదిలాఉండగా.. సీఎం రేవంత్ బృందం ఏప్రిల్ 15న జపాన్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 22 వరకు అక్కడ పర్యటించింది. ఈ పర్యటనలో సీఎం రేవంత్ వెంట మంత్రి శ్రీధర్ బాబు, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు ఉన్నారు.