Medchal : పెళ్లికి నిరాకరించిందని..అచ్చం..రాజు వెడ్స్‌ రాంబాబు సినిమాలాగే..

ఇటీవల విడుదలై గద్దర్‌ అవార్డు పొందిన  ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రం కథను తలపించేలా ఓ యువతికి ఒక యువకుడు ఎయిడ్స్‌ సోకిన రక్తాన్ని ఎక్కించాడు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పోచారం ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారింది.

New Update
FotoJet (7)

Women Injected HIV Injection By Lover

Medchal  : ఇటీవల విడుదలై గద్దర్‌ అవార్డు పొందిన  ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రం కథను తలపించేలా ఓ యువతికి ఒక యువకుడు ఎయిడ్స్‌ సోకిన రక్తాన్ని ఎక్కించాడు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పోచారం ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారింది. ఆ యువతి పెళ్లికి నిరాకరించడంతో పగ పెంచుకున్న యువకుడు ఆమెకు ఎయిడ్స్ సోకిన రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించినట్లు ఆరోపణలు వచ్చాయి. రాజు వెడ్స్ రాంబాయి సినిమాను తలిపించేలా జరిగినా ఈ ఫైశాచిక ఘటన తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది.  

 పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పోచారం ప్రాంతంలోని అన్నోజిగూడకు చెందిన మనోహర్‌ అనే వ్యక్తితో యువతికి పెళ్లి నిశ్చయమైంది. అయితే పెళ్లికి ముందు ఇద్దరి రక్తనమునాలు సేకరించి టెస్ట్‌ చేయించగా మనోహర్‌కు HIV(ఎయిడ్స్) పాజిటివ్ ఉందని తెలియడంతో ఆ యువతి అతడితో పెళ్లికి నిరాకరించింది. అయినప్పటికీ మనోహర్‌ మాత్రం తనను పెళ్లి చేసుకోవాలని యువతిని 
వేధించడం మొదలు పెట్టాడు. --- మనోహర్‌తో పాటు అతని తల్లిదండ్రులకు కూడా ఎయిడ్స్‌ ఉందని నిర్ధారణ కావడంతో తన ప్రాణాలను పణంగాపెట్టి పెళ్లి చేసుకోలేనని వారికి తేల్చి చెప్పింది. దీంతో అతను ఆ యువతిపై కక్ష పెంచుకున్నాడు. తనకు దక్కనిది మరోకరికి దక్కకూడదని ఉన్మాదిగా మారిన మనోహర్‌ పిచ్చిగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. ఎయిడ్స్‌ తో నేను ఎలాగు చనిపోతాను. నా వ్యాధి గురించి తెలిసి నన్ను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన నీవు నాతోపాటే చావాలి. అంటూ రాక్షసంగా ప్రవర్తించాడు. ఎయిద్స్‌ సోకిన రక్తాన్ని ఆ యువతి శరీరంలోకి బలవంతంగా ఎక్కించాడు.


క్షణాల్లో జరిగిన ఈ ఘటనతో యువతి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తర్వాత తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో స్పందించిన ఘట్‌కేసర్ పోలీసులు మనోహర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ ప్రారంభించారు. ఎయిడ్స్‌ రక్తాన్ని అతను ఎక్కడి నుంచి సేకరించాడు? తన శరీరంలోని రక్తాన్నే ఎక్కించాడా? లేక వేరేవారి సహయంతో రక్తాన్ని సేకరించాడా? అని ఆరా తీస్తున్నారు. యువతి ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. కాగా, 24 గంటలు గడిస్తే కానీ, యువతి శరీరంలోకి HIV(ఎయిడ్స్)  వ్యాధికి సంబంధించిన రక్తం చేరిందా? లేదా అని నిర్ధారణ అవుతుందని వైద్యులు చెబుతున్నారు. నిందితున్ని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. బాధితురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించేలా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రేమ పేరుతో ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడే వారిపై కఠిన చట్టాలు ప్రయోగించాలని స్థానికులు డిమాండ్ చేశారు. బాధితురాలు త్వరగా కోలుకోవాలని స్థానికులు ఆకాంక్షించారు.

Advertisment
తాజా కథనాలు