Harish Rao : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా చిట్ చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌కు సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని సంచలన ఆరోపణలు చేశారు. మధ్యప్రదేశ్‌లో ఆమె రాజ్యసభ అభ్యర్థిత్వం తిరస్కరణకు గురవ్వడం వెనుక తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యుల హస్తం ఉందన్నారు. ఈ లీకేజీ వ్యవహారంపై మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రే స్వయంగా క్లారిటీ ఇచ్చారని, ఇన్‌ఛార్జికే వెన్నుపోటు పొడిచిన సీఎం రేవంత్ రెడ్డి, రేపు రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడవరనే గ్యారెంటీ ఏముందని హరీశ్ రావు ప్రశ్నించారు.
ఈ అంతర్గత కుట్రల వెనుక సీఎం రేవంత్ రెడ్డి నమ్మకస్తుడైన ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారని హరీశ్ రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన వర్కింగ్ ప్రెసిడెంట్ల జాబితాను మీనాక్షి నటరాజన్ గతంలో తిరస్కరించారని, ఆ కక్షతోనే సదరు కాంగ్రెస్ నేత ఆమెకు సంబంధించిన లీగల్ సమాచారాన్ని మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రికి చేరవేశారని స్పష్టం చేశారు. ఈ తీవ్రమైన ఉదంతంపై ధైర్యముంటే సిట్ (SIT) లేదా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి విచారణ జరిపించాలని సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్ విసిరారు. సొంత పార్టీ అధిష్ఠాన ప్రతినిధులపైనే ఇటువంటి కుతంత్రాలకు పాల్పడటం కాంగ్రెస్ సంస్కృతికి అద్దం పడుతోందని మండిపడ్డారు.
గతంలో కేసీఆర్ ప్రగతి భవన్ (ప్రస్తుత జ్యోతిరావు పూలే ప్రజాభవన్) నిర్మిస్తే నానా యాగి చేసిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు తన సొంత విలాసాల కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని తగలేస్తున్నారని హరీశ్ రావు దుయ్యబట్టారు. ‘మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ’ (MCHRD) ప్రాంగణంలో కేవలం రూ. 7 కోట్లతో వీఐపీ గెస్ట్ హౌస్ కడతామని జీవో ఇచ్చి, ఇప్పటికే రూ. 70 కోట్లపైగా ఖర్చు చేశారని ఆరోపించారు. దీనికి ‘బోధి పెవిలియన్’ అని పేరు పెట్టి, ఇటాలియన్ ఫర్నిచర్ కోసం, కేవలం ఇనుప కంచెల (ఫెన్సింగ్) కోసమే రూ. 17 కోట్లు వృధా చేశారన్నారు. నటుడు చిరంజీవి ఇంటి పక్కన నిర్మిస్తున్న మరో భవనంలో ఫుట్‌బాల్ గ్రౌండ్ కోసం మరో రూ. 10 కోట్లు తగలేస్తున్నారని, ఈ భవన నిర్మాణం పూర్తయ్యేసరికి రూ. 100 కోట్లు దాటేలా ఉందన్నారు. సీఎం తన కుటుంబ సభ్యులతో కలిసి పదుల సార్లు అక్కడికి వెళ్లి మరీ ప్రతి వస్తువును దగ్గరుండి సెలెక్ట్ చేసుకుంటున్నారని విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అసలు ఇన్ని చాంబర్లు, క్యాంపు ఆఫీసులు ఎందుకని హరీశ్ రావు ప్రశ్నించారు. ఇప్పటికే సెక్రటేరియట్, MCHRD, కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC), అసెంబ్లీలతో పాటు శాసనమండలిలోనూ సర్వహంగులతో ప్రత్యేక చాంబర్లు చేయించుకున్నారని, రేపు రాబోయే ‘ఫ్యూచర్ సిటీ’లోనూ మరో సీఎం ఆఫీసు కట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. "చదువు చారెడు.. బలపాలు దోసేడు" అన్న చందంగా సీఎం రేవంత్ రెడ్డి పనితీరు తక్కువ, ఆఫీసులు ఎక్కువ అన్నట్లుగా మారిందని దెప్పిపొడిచారు. ప్రభుత్వం వద్ద నిధులు లేవనే సాకుతో పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులకు రుణమాఫీ, భరోసా ఇవ్వడం లేదు కానీ, సీఎం షోకులకు, లగ్జరీలకు వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని నిలదీశారు. గతంలో హెలికాప్టర్ రెంట్‌కు నెలకు రూ. 2 కోట్లు ఉంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి తన కోసం నెలకు రూ. 5 కోట్ల భారీ వ్యయంతో లగ్జరీ హెలికాప్టర్‌ను తెప్పించుకుంటున్నారని ఆరోపించారు.
రాష్ట్ర విద్యాశాఖకు మంత్రే లేకపోవడం, ఆ శాఖ సీఎం పరిధిలోనే ఉండటం వల్ల విద్యావ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ 12 నుంచే పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉన్నా, ప్రభుత్వం కావాలనే వాయిదా వేసిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే యూనిఫామ్స్, షూస్, బెల్టుల సరఫరాలో దాదాపు రూ. 2,000 కోట్ల భారీ కుంభకోణానికి కాంగ్రెస్ సర్కార్ తెరలేపిందని ఆరోపించారు. గత పదేళ్లుగా కేసీఆర్ హయాంలో స్థానిక చేనేత కార్మికులకు, లిడ్‌క్యాప్ (LIDCAP) సంస్థలకు బట్ట, షూస్ ఆర్డర్లు ఇచ్చి ఇక్కడి నేతన్నలను ఆదుకునేవాళ్లమని గుర్తు చేశారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఇక్కడి దళితుల, నేతన్నల పొట్టకొట్టి, తనకు కావాల్సిన గుజరాత్ సంస్థలకు ఈ టెండర్లను కట్టబెట్టారని మండిపడ్డారు. దీనివల్ల విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఇంతవరకు ప్రభుత్వ, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు నోట్ బుక్స్, యూనిఫామ్ బట్ట అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రియల్ ఎస్టేట్ మాఫియా కోసం, తన అనుయాయుల ప్రయోజనాల కోసమే ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పరిధిలోని జీవో 111 ను ఎత్తివేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి తెరవెనుక వేగంగా పావులు కదుపుతున్నారని హరీశ్ రావు ఆరోపించారు. పాలనను పూర్తిగా గాలికొదిలేసి, కేవలం ప్రచార ఆర్భాటాలు, సొంత ప్రయోజనాల కోసమే ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. ఒకవైపు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల కోసం రోడ్డెక్కుతుంటే, ముఖ్యమంత్రి మాత్రం విలాసవంతమైన భవనాలు, లగ్జరీ హెలికాప్టర్లతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, దీనిపై ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని హరీశ్ రావు స్పష్టం చేశారు.
Harish Rao : మీనాక్షి నటరాజన్‌కు వెన్నుపోటు పొడిచింది రేవంత్ రెడ్డే...హారీష్ రావు సంచలన కామెంట్స్
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌కు సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఇన్‌ఛార్జికే వెన్నుపోటు పొడిచిన రేవంత్ రెడ్డి, రేపు రాష్ట్ర ప్రజలకు కూడా వెన్నుపోటు పొడుస్తారన్నారు.
Harish Rao