/rtv/media/media_files/2025/03/21/azivJp6U0NXUQ8MsWzT5.jpg)
CM Revanth Reddy,Harish Rao
సీఎం రేవంత్ రెడ్డితో భేటీపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. సికింద్రాబాద్ నియోజకవర్గ సమస్యల పైనే సీఎం రేవంత్ ను కలిశానన్నారు హరీష్. సికింద్రాబాద్ లో కేసీఆర్ హయాంలో మంజూరు చేసిన హైస్కూల్, కాలేజీ పనులను వెంటనే ప్రారంభించాలని సీఎంను కోరామన్నారు. సీఎం వెంటనే స్పందించి వేం నరేందర్ రెడ్డికి ఆ పేపర్ ఇచ్చి ఆ పనులు అయ్యేలా చూడాలని చెప్పారని తెలిపారు. పద్మారావు రమ్మంటేనే సీఎంను కలిసేందుకు తాను వెళ్లానని అన్నారు హరీష్ రావు. తాము వెళ్లేసరికి సీఎం రూమ్ నిండా మంది ఉన్నారని... 15 నిమిషాల పాటు సీఎంతో ఏమీ మాట్లాడలేదని.. ఆ తరువాత తాము కలిసి నియోజకవర్గ సమస్యలపై వినతిపత్రం ఇచ్చామన్నారు.
Also read : ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు బిగ్ షాక్.. కేఎల్ రాహుల్ దూరం!
Also Read : ప్లే స్టోర్‌లో గూగుల్ 331 యాప్స్ రిమూవ్.. అవి మీ ఫోన్‌లో ఉంటే యమ డేంజర్
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, పద్మారావు
— Telugu Scribe (@TeluguScribe) March 21, 2025
పద్మారావు నియోజకవర్గం సికింద్రాబాద్‌లో కేసీఆర్ మంజూరు చేసిన హై స్కూల్, కాలేజీ పనులను వెంటనే ప్రారంభించాలని సీఎం దగ్గరకు వెళ్ళాము
మేము వెళ్లేసరికి రూమ్ నిండా మంది ఉన్నారు
ఆ పేపర్లను వేం నరేందర్ రెడ్డి కి ఆ… pic.twitter.com/8ABEhW6e50
సీఎం రేవంత్‌ను కలిసిన మల్లారెడ్డి కుటుంబం
అంతకు ముందు సీఎం రేవంత్‌ను మల్లారెడ్డి కుటుంబ సభ్యులు కలిశారు. మెడికల్ కళాశాల సీట్ల పెంపు కోసం సీఎంను కలిసినట్లు ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డి చెప్పారు. కాగా సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం చెన్నై బయలుదేరారు. తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన డీలిమినేషన్‌పై రేపు(శనివారం) చెన్నైలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఈ అఖిలపక్ష సమావేశానికి రేవంత్ తో సహా బీఆర్ఎస్ అగ్రనాయకులు కూడా హాజరుకానున్నారు.
Also Read : రేషన్‌కార్డు దారులకు గుడ్ న్యూస్.. ఊగాది నుంచి కార్డుపై...