Gayatri: హమాలీ బిడ్డకు జడ్జి హోదా.. గాయత్రి విజయ ప్రస్థానమిదే!

నిరుపేద కుటుంబంలో జన్మించిన హామాలీ కూతురు జడ్జిగా నియామకమైంది. పెద్దపల్లి జిల్లాకు చెందిన గాయత్రి ఏపీలో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైంది. గాయత్రి పట్టుదలపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. 

New Update
ereree

TG News: పెద్దపల్లి జిల్లాలోని ఓ నిరుపేద కుటుంబంలో జన్మించిన గాయత్రి పట్టుదలతో చదివి జడ్జిగా నియామకమయ్యారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వాటిని అధి గమించి తన లక్ష్యానికి చేరుకున్నారు. జూలపల్లి మండలం వద్కాపూర్ గ్రామానికి చెందిన మొగుర లక్ష్మి-మొండయ్య దంపతులకు నలుగురు పిల్లలు అనిల్, అభిషేర్, రూతురు, గాయత్రి ఉన్నారు. మొండయ్య హమాలీ పనులతో పాటు వ్యవసాయ భూమిని గాయత్రి కౌలు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనా భరిస్తూనే ముగ్గురినీ చదివించారు. ఇద్దరు కుమారులు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నారు. గాయత్రి స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పది వరకు చదువుకుని, పెద్దపల్లి ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు.

ఇది కూడా చదవండి: బాలీవుడ్ లో 'పుష్ప'మేనియా.. ప్రీ సేల్స్ బుకింగ్స్ లో నయా రికార్డ్

ఏపీ జూనియర్ సివిల్ జడ్జిగా..

అయితే లా చేయాలన్న సంకల్పంతో గాయత్రి హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీలో ఎల్ఎల్ బీ పూర్తి చేసింది. అనంతరం పీజీ లా కామన్ ఎంట్రెన్స్ రాష్ట్ర స్థాయిలో నాలుగో ర్యాంక్ సాధించింది. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం విద్యనభ్యసించి, ఇంటి వద్దే చదువుకుని పోటీ పరీక్షలకు సన్నద్ధమైంది. ఈ క్రమంలోనే ఇటీవల ఏపీ హైకోర్టు నిర్వహించిన న్యాయ సంబంధిత సివిల్ జడ్జి జడ్జి విభాగం పోటీ పరీక్షలు రాసింది. నవంబర్ 27న విడుదలైన ఫలితాల్లో గాయత్రి ఏపీలో జూనియర్ సివిల్ జడ్జిగా నియామకమకం కావడంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఆమెను గ్రామ ప్రజలు, మిత్రులు, బంధువులు అభినందించారు.

ఇది కూడా చదవండి: దేశంలో నల్లధనం పెరుగుతోంది.. అంబానీ, అదానీకే అడ్డగోలు మాఫీలు!

Also Read: మరో చరిత్ర సృష్టించనున్న ఇస్రో.. డిసెంబర్ 4న సరికొత్త ప్రయోగం

Also Read: యూపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఆ ప్రాంతం ఇక మహాకుంభమేళ జిల్లా

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు