/rtv/media/media_files/2025/03/14/OAeHMEqXWR9p0adKyYu3.jpg)
Half day school
Half day school: తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం ఆరుగంటల నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలకు ఒంటిపూట బడులు ప్రకటించిన విషయం తెలిసిందే. పదవితరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో మాత్రం స్కూల్ టైమింగ్స్ మారనున్నాయి. మిగతా పాఠశాలల్లో ఉదయం పూటే పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.
ఇది కూడా చూడండి: Aaryan Shukla: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణ్రోగ్రతల దృష్ట్యా.. విద్యార్ధులకు ఇబ్బంది కలగకుండా ఒంటిపూట బడులు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో రేపటి నుంచి ఏప్రిల్ 24 వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి. ఆ తరువాత జూన్ 12 వరకు వేసవి సెలవులు కొనసాగనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ తాజా ఉత్తర్వుల్లో ఆఫ్ డే స్కూల్ టైమింగ్స్ వెల్లడించింది.
ఇది కూడా చదవండి: 40 ఏళ్ల తర్వాత కూడా యంగ్‌గా కనిపించాలంటే ఇలా చేయండి
ఏపీలో ఉదయం 7.45 గంటల నుంచి 12.30 గంటల వరకు ఒంటిపూట బడులు నిర్వహిస్తారు. పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం 1.15 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించేలా విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.తెలంగాణలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయి. పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సెంటర్లలో మాత్రం మధ్యాహ్నం 1.00 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు
Also Read : పరువు పోయిందిగా.. పాకిస్థాన్ క్రికెటర్లకు ఘోర అవమానం!
Also Read: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో హోలికా దహన్ ..లక్షలాది కొబ్బరికాయలతో...