తొలిరోజు గ్రూప్-1 ఎగ్జామ్ కు ఎన్ని వేల మంది హాజరు కాలేదంటే?

రాష్ట్రంలో గ్రూప్1 మెయిన్స్ ఎగ్జామ్ మొదటి రోజు ప్రశాంతంగా ముగిసింది. సోమవారం జరిగిన ఈ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఇంగ్లిష్ ఎగ్జామ్ కు మొత్తం 31,403 మందికి గానూ 22,750 మంది హాజరయ్యారు. అంటే దాదాపు 72.4 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.

New Update
tgpsc group 1

రాష్ట్రంలో 563 గూప్-1 పోస్టుల భర్తీకి సోమవారం మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించారు. ఎన్నో వివాదాల మధ్య ఈ మెయిన్స్ ఎగ్జామ్ మొదటి రోజు ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 46 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఈ ఎగ్జామ్ జరిగింది. అయితే ఈ మెయిన్స్ ఎగ్జామ్స్ కి మొత్తం 31,403 మందికి గానూ 22,750 మంది హాజరయ్యారు. అంటే ఈ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఇంగ్లిష్ ఎగ్జామ్ కు 72.4 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారని టీజీపీఎస్సీ తెలిపింది. 

Also Read:  కిలో వెండి అక్షరాల లక్ష రూపాయలు!

ఏ జిల్లాలో ఎంత శాతం మంది

Also Read: కరీంనగర్‌లో ఈఎస్ఐ హాస్పిటల్.. బండి విజ్ఞప్తికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

ఇందులో హైదరాబాద్ లోనే ఎక్కువ మంది అభ్యర్థులు హాజరైనట్లు పేర్కొంది. హైదరాబాద్ జిల్లాలో 87.23 శాతం, రంగారెడ్డి జిల్లాలో 73.07 శాతం, మేడ్చల్ జిల్లాలో 67.49 శాతం మంది హాజరైనట్లు వెల్లడించింది. అదే సమయంలో హైకోర్టు అనుమతితో స్పోర్ట్స్ కోటా నుంచి 20 మంది అభ్యర్థులు హాజరైనట్లు తెలిపింది. 

Also Read:  రాష్ట్రంలో బాణాసంచా నిషేధం.. గోదాంలు సీల్ చేయాంటూ హైకోర్టు ఆదేశాలు!

జిల్లాల వారీగా సెంటర్లు

ఇదిలా ఉంటే గ్రూప్ 1 అటెండెన్స్ వివరాల విషయానికొస్తే.. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 8 సెంటర్లు ఏర్పాటు చేశారు. అందులో 5,613 మంది అభ్యర్థులకు గానూ 4,896 మంది హాజరయ్యారు. అదే సమయంలో రంగారెడ్డి జిల్లాలో 11 సెంటర్లు ఏర్పాటు చేశారు. అందులో 8,011 మంది అభ్యర్థులకు గానూ 5,854 మంది హాజరయ్యారు. అలాగే మేడ్చల్ జిల్లాలో 27 సెంటర్లు ఏర్పాటు చేశారు. అందులో 17,779 మందికి గానూ 12,000 మంది హాజరయ్యారు. 

Also Read: గొప్ప మనసు చాటుకున్న మంచు లక్ష్మి.. 50 స్కూళ్ళు దత్తత తీసుకొని.

కాగా ఈ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ సెంటర్లకు చాలా మంది అభ్యర్థులు దాదాపు రెండుగంటల ముందే చేరుకున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1 గంట వరకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. అదే సమయంలో ఆలస్యంగా వచ్చిన వారిని లోపలికి అనుమతించలేదు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు