Ramzan Holidays : ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌...వారికి మూడు రోజులు సెలవు

రంజాన్  పండగ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముస్లింలకు పవిత్ర పండగ అయినా రంజాన్ నేపథ్యంలో సర్కార్ రెండు రోజులు సెలవులు  ప్రకటించింది. మార్చ్ 31న ఈదుల్ ఫితర్ (రంజాన్) తోపాటు.. తరువాతి రోజైన ఏప్రిల్ 1న కూడా సెలవు దినంగా ప్రకటించింది.

New Update
 Ramadan holidays

Ramadan holidays

Ramzan Holidays : రంజాన్  పండగ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముస్లింలకు పవిత్ర పండగ అయినా రంజాన్ నేపథ్యంలో సర్కార్ రెండు రోజులు సెలవులు  ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వ పని దినాల ప్రకారం మార్చ్ 31న ఈదుల్ ఫితర్ (రంజాన్) తోపాటు.. తరువాతి రోజైన ఏప్రిల్ 1న కూడా సెలవు దినంగా ప్రకటించింది. ఇక మార్చ్ 28న జమాతుల్-విదా, షబ్-ఎ-ఖాదర్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇచ్చింది. ఆ రోజు మైనారిటీ విద్యాసంస్థలకు సెలవు ఉండనుండగా.. మిగతావి యధావిధిగా పనిచేస్తాయి.

Also Read: 'బొంబాయికి రాను' సాంగ్ సరికొత్త రికార్డ్.. 5 లక్షల పెట్టుబడి... వచ్చింది ఎన్ని లక్షలో తెలుసా?

Also Read: 'బొంబాయికి రాను' సాంగ్ సరికొత్త రికార్డ్.. 5 లక్షల పెట్టుబడి... వచ్చింది ఎన్ని లక్షలో తెలుసా?

 అయితే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి బోనాల పండగ మరుసటి రోజు, క్రిస్మస్ మరుసటి రోజు, రంజాన్ మరుసటి రోజు కూడా సెలవు ప్రకటించడం ఆనవాయితీగా వస్తుండగా.. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆ విధానాన్నే కొనసాగిస్తోంది. ఇక ఏపీ ప్రభుత్వం మాత్రం మార్చ్ 31న ఒక్కరోజు మాత్రమే సెలవుగా ప్రకటించింది. రంజాన్‌ పండుగకు ఒకరోజు ముందే ఉగాది పండుగ వస్తుండగా ఆ రోజు ఆదివారం కావడంతో ప్రత్యేకంగా సెలవు ప్రకటించాల్సిన అవసరం లేకుండా పోయింది.

Also Read: Mangalavaaram: ఇది అస్సలు ఊహించలేదు.. 'మంగళవారం' సీక్వెల్ లో హీరోయిన్ గా ఎవరంటే!

ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

Advertisment
Advertisment
Advertisment