/rtv/media/media_files/2025/04/02/MjN2mjeD9sCFNewj0BI7.jpg)
Adilabad Airport
Adilabad Airport : తెలంగాణకు మరో భారీ గుడ్ న్యూస్ ప్రకటించింది కేంద్రం. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే వరంగల్ మామూనూర్ ఎయిర్పోర్టు కు కేంద్రం అనుమతివ్వగా.. తాజాగా మరో ఎయిర్‌పోర్ట్‌కు భారత వాయుసేన(IAF) అనుమతి మంజూరు చేయడం విశేషం. ఈ మేరకు తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలతో పాటు, తెలంగాణ ప్రజలందరికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకుముందు మామునూర్ ఎయిర్ పోర్టుకు అనుమతులు సాధించిన తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడు ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు అనుమతులు సాధించడంపట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
Also Read : హనుమంతుడి ఈ 4 మంత్రాలు పఠిస్తే.. మీ కష్టాలన్నీ పరార్!
త్వరలోనే అక్కడ వాయుసేన శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ గా అభివృద్ధి చేయాలని వాయుసేన లేఖ ద్వారా సూచించిందని కోమటిరెడ్డి తెలిపారు. రన్ వే పునర్నిర్మాణ , పౌర టర్మినల్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఎయిర్ క్రాఫ్ట్ ఎప్రాన్ సహా మౌలిక వసతులను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు కోమటిరెడ్డి. వీటికి అవసరమైన భూమిని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఇవ్వాలని వాయుసేన సూచించినట్లు చెప్పారు. ఈ విషయంపై అధికారులతో సమీక్షిస్తున్నామని...త్వరలోనే అన్ని వివరాలతో కూడిన నివేదికను కేంద్రానికి పంపిస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
ఇది కూడా చదవండి: ఏప్రిల్ 30న ఏం కొనాలి? ఏం కొనొద్దు?.. ఇలా చేస్తే మీరే కోటీశ్వరులు!
ఆరు నెలల స్వల్పవ్యవధిలోనే రెండు ఎయిర్ పోర్టులకు అనుమతులు సాధించడం.. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అవిశ్రాంత కృషికి దక్కిన ఫలితమని అన్నారు. ఈ ఎయిర్పోర్టును సివిల్ ఏవియేషన్, ఎయిర్ ఫోర్స్ విమానాల రాకపోకలకు అనుగుణంగా ఒక జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ గా అభివృద్ధి చేయాలని వాయుసేన సూచించినట్టు తెలిపిన మంత్రి.. సివిల్ ఎయిర్ క్రాఫ్ట్స్ రాకపోకలకు అనువుగా రన్‌వే పునర్నిర్మాణం చేయడం, సివిల్ టర్మినల్ ఏర్పాటు, ఎయిర్‌క్రాఫ్ట్ ఎప్రాన్ (విమానాలు నిల్చోవడానికి, మలుపులు తిరగడానికి మరియు ఇతర విమానయాన కార్యకలాపాలకు ఉపయోగించే నిర్దిష్ట ప్రాంతం) వంటి ఇతర మౌలిక వసతులను అభివృద్ధి పనులు చేయాల్సి ఉందని ఆయన తెలిపారు.
Also Read: Minor boy accident: 15ఏళ్ల బాలుడు కారు డ్రైవింగ్.. 2ఏళ్ల చిన్నారి మృతి
ఇందుకు అవసరమైన భూమిని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI)కు సమకూర్చుకోవాలని వాయుసేన అధికారులు లేఖలో సూచించినట్టు మంత్రి తెలియజేశారు. తెలంగాణలో మొన్న మామునూర్, నేడు ఆదిలాబాద్ ఎయిర్ పోర్టులకు అనుమతుల మంజూరీలో సహకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుకి, రాష్ట్రంలో ఏయిర్ పోర్ట్ ల ఏర్పాటుకు అండగా నిలబడుతున్న సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
Also Read: Mega 157: తొలి సీన్లోనే అదరగొట్టిన చిరు.. అనిల్ రావిపూడి మూవీ నుంచి అదిరిపోయే వీడియో!