Breakfast : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌..ఇక 6 రోజులు.. 5 రకాల టిఫిన్లు

సర్కార్‌ బడుల్లో పిల్లలకు అందజేసే బ్రేక్‌ ఫాస్ట్‌కు సంబంధించి అధికారులు కొత్త మెనూను సిద్ధం చేశారు. వారంలో 6 రోజులు 5 రకాల టిఫిన్లను పిల్లలకు అందజేయనున్నారు. రెండు రోజుల పాటు మిల్లెట్‌ ఇడ్లీ, ఒక రోజు మిల్లెట్‌ ఉప్మాతో పాటు మూడు రోజులు రాగిజావ అందజేస్తారు.

New Update
FotoJet (13)

Good news for government school students

Breakfast : సర్కార్‌ బడుల్లో పిల్లలకు అందజేసే బ్రేక్‌ ఫాస్ట్‌కు సంబంధించి అధికారులు కొత్త మెనూను సిద్ధం చేశారు. వారం రోజుల్లో ఆరురోజులు ఐదు రకాల టిఫిన్లను పిల్లలకు అందజేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. అందులో ప్రత్యేకంగా రెండు రోజుల పాటు మిల్లెట్‌ ఇడ్లీతో పాటు ఒక రోజు మిల్లెట్‌ ఉప్మా, మూడు రోజులు రాగిజావ అందజేయాలని అధికారులు నిర్ణయించారు. 
 
19 లక్షల మందికి బ్రేక్‌ ఫాస్ట్‌

కాగా ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయనున్న బ్రేక్‌ఫాస్ట్‌ మూలంగా రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న 26,178 సర్కారు బడుల్లో చదువుతున్న 19 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. సర్కారు పాఠశాలలకు వచ్చే వారిలో ఎక్కువగా పేదింటి పిల్లలే ఉంటారు. వీరంతా ఉదయం ఎలాంటి అల్పాహారం తీసుకోకుండానే స్కూళ్లకు వస్తున్నారు. దీనివల్ల వారు చదువులపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారని పలు సర్వేలు, రిపొర్టుల్లో వెల్లడైంది.  ఈ క్రమంలో ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీల్లో సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం ద్వారా పిల్లలకు అల్ఫాహార అందించాలని నిర్ణయించింది.

వచ్చే ఏడాది నూతన విద్యాసంవత్సరం ఆరంభమైన తర్వాత జూన్ 12 నుంచి దీన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా విద్యార్థులకు ఎలాంటి బ్రేక్‌ ఫాస్ట్‌ ఇవ్వాలనే దానిపై కసరత్తు చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఎట్టకేలకు గురువారం మెనూను రిలీజ్ చేశారు. ప్రస్తత బడ్జెట్‌లో  ఈ స్కీమ్‌ కోసం ప్రభుత్వం రూ.720 కోట్లు కేటాయించడం గమనార్హం. ప్రతి రోజు ఉదయం పూట పిల్లలకు పౌష్టికాహారం అందించడం వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత పెరిగి, విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని ప్రభుత్వం ‌ భావిస్తోంది. ఇక మెనూలో  మంగళ, గురువారాల్లో మిల్లెట్ ఇడ్లీ, శుక్రవారం మిల్లెట్ ఉప్మా, సోమవారం దోశ, బుధవారం పూరీ, శనివారం బోండా  అందించాలని నిర్ణయించారు. 

విద్యార్థులకు ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ అందించి ఊర్కొవడమే కాకుండా చిన్నారుల కోసం పాలు, రాగి జావను కూడా అందించేందుకు మెనూను తయారు చేశారు. వారంలో సోమ, బుధ, శుక్రవారాల్లో పాలు అందిస్తారు. ఇక మిగిలిన మంగళ, గురు, శనివారాల్లో రాగి జావ అందించనున్నారు. ఈ స్కీమ్‌ అమలు కోసం వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేయడానికి సిద్ధమైంది.

రూ,180 కోట్ల ఖర్చు

పిల్లలకు అందించే బ్రేక్‌ పాస్ట్‌ కోసం రూ.540 కోట్లు, పాల కోసం రూ.180 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని కోసం స్కూల్ ఎడ్యుకేషన్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల కింద కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే, ఈ బ్రేక్‌ఫాస్ట్‌ స్కీమ్‌ మూలంగా బడిలో పిల్లల అటెండెన్స్ పెరగడంతో పాటు డ్రాపౌట్లు భారీగా తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

మెనూ ఎలా ఉండబోతుందంటే..

సోమవారం       దోశ, పాలు 
మంగళవారం మిల్లెట్ ఇడ్లీ, రాగి జావ
బుధవారం    పూరీ, పాలు
గురువారం    మిల్లెట్ ఇడ్లీ, రాగిజావ
శుక్రవారం     మిల్లెట్ ఉప్మా/ పొంగల్​, పాలు
శనివారం     బోండా, రాగి జావ 

Advertisment
తాజా కథనాలు