/rtv/media/media_files/2025/03/21/7BG2DO2dbUKtJXIOa0cu.jpg)
Food safety officers raid
Hyderabad: హైదరాబాద్‌లోని పలు హోటల్స్ మనుషుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. తక్కువ ధరకే వస్తుందని నిల్వచేసిన కుళ్లిపోయిన మేక, గొర్రె మాంసాన్ని కొనుగోలు చేసి కస్టమర్లకు వండి వడ్డిస్తున్నారు. హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెలుగుచూశాయి.
ఇది కూడా చదవండి: AP News: ఏపీకి మరో మూడు సార్లు అతనే సీఎం.. పవన్ సంచలన వ్యాఖ్యలు!
హైదరాబాద్ నగరంలోని డబీర్‌పురలో మాతాకీ కిడ్కి ప్రాంతంలో కమిషనర్ టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో, అక్రమంగా పాడైన మేక, గొర్రె మాంసాన్ని ఫ్రిడ్జ్‌లో నిల్వ చేసి వాటిని వివిధ వివాహాలు, హోటల్స్‌కి సరఫరా చేస్తున్న మహమ్మద్ మిస్బాహుద్దీన్ అనే 24 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మహమ్మద్ మిస్బాహుద్దీన్ తన వద్ద 2 క్వింటాళ్ల పాడైన మేక, గొర్రె మాంసాన్ని ఫ్రిజ్‌లలో నిల్వ చేసి వాటిని తక్కువ ధరకు వివాహాలు, హోటల్స్‌కి విక్రయిస్తున్నాడు. పోలీసులు అతని వద్ద నుంచి పాడైన మాంసం సీజ్ చేశారు,
ఇది కూడా చదవండి: AP News: SC వర్గీకరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం!
మహమ్మద్ మిస్బాహుద్దీన్ పాడైపోయిన మేక, గొర్రెల తలకాయలు, కాళ్ళు, బోటీ, లివర్ లను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి.. పెళ్ళిళ్ళు హోటల్స్ కి సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. రెండ్రోజుల క్రితం గోషామహల్ లో 12 టన్నుల పాడైన మాంసాన్ని పోలీసులు సీజ్ చేశారు. పాడైపోయిన ఈ మాంసాన్ని స్టోర్ చేసి.. తక్కువ ధరకు బల్క్ గా అమ్ముతున్నట్లు దాడుల్లో గుర్తించారు. ఎక్కువగా ఓల్డ్ సిటీ అడ్డాగా ఈ దందా నడుస్తున్నట్లు గుర్తించిన అధికారులు దాడులు చేస్తున్నారు. వారాల కొద్దీ నిల్వ చేసిన మేకలు, గొర్రెల మాంసం, వాటి విడి భాగాలను పలు శుభకార్యాలకు, హోటళ్లకు సరఫరా చేస్తున్న ఓ మాంసం వ్యాపారిని మంగళ్‌హాట్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.8 లక్షల విలువ చేసే 12 టన్నుల మాంసాన్ని, వాటి విడి భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి మంగళ్‌హాట్ పోలీసులకు అప్పగించారు.
Also Read : లాభాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..
ఇవాళ(మార్చి 21)న ఉదయం కొండాపూర్ లోని కాకినాడ సుబ్బయ్యగారి హోటల్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. కిచెన్ అపరిశుభ్రవంగా ఉండటంతో పాటు డ్రైనేజీ వాటర్ పొంగుతున్నట్లుగా గుర్తించారు అధికారులు. చెడిపోయిన కూరగాయలు, కాలం చెల్లిన ఇతర వస్తువుల వాడుతున్నట్లు గుర్తించారు. హోటల్ లో పని చేస్తున్న స్టాఫ్ కూడా కనీసం హ్యాండ్ గ్లోవ్స్, హెడ్ కాప్స్ కూడా ధరించడం లేదని తెలిపారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కూడా డిస్ ప్లే చేయలేదని చెప్పారు.
Also Read: ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న 'లూసిఫర్2: ఎంపురాన్' ట్రైలర్..!