/rtv/media/media_files/2025/03/26/SvlNsq3dtog5wk4blLO5.jpg)
Ganja Lady Don Sangeetha Sahu
Ganja Lady Don : మత్తుపదార్థాలు, గంజాయి నేటి యువతను పట్టి పీడిస్తు్న్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టిన కొత్త కొత్త మార్గంలో నిందితులు మత్తుపదార్థాలను విక్రయిస్తూనే ఉన్నారు. గంజాయి నిర్మూళనకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నప్పటికీ అడ్డుకట్ట పడడం లేదు. ముఖ్యంగా యువత గంజాయికి అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం గంజాయి రవాణా చేసే వారిపై ఉక్కుపాదం మోపుతోంది. ఇటీవల ధూల్ పేట గంజాయి డాన్ అంగూర్ బాయి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఒరిస్సా గంజాయి లేడీ డాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలో ఐదు కేసుల్లో నిందితురాలిగా ఉన్న సంగీతా సాహును అరెస్టు చేయడానికి ప్రత్యేక టీమ్‌ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసస్ రెడ్డి ఒరిస్సాకు పంపించారు.
Also read : యూఎస్ హెల్త్ ఏజెన్సీకి అధిపతిగా భారత సంతతి వ్యక్తి నియామకం!
నంద్యాల అంజి రెడ్డి పర్యవేక్షణలో తెలంగాణ నుంచి వేయి కిలో మీటర్ల దూరంలో ఉన్న ఒరిస్సాకు కాళీకోట్ వెళ్లిన ఎస్ టీ ఎఫ్ సీ పంపిన టీమ్ స్థానిక పోలీస్‌ల సహకారం తీసుకొని సంగీతా సాహును అరెస్టు చేసి తీసుకొచ్చారు. సంగీతా సాహును అరెస్టు చేయడానికి ఒరిస్సాకు వెళ్లిన టీమ్‌లో ఎస్సై సైదులు, హెడ్ కానిస్టేబుల్ కె.శ్రీధర్, కానిస్టేబుళ్లు మహేష్, అరుణ్, మంగలు ఉన్నారు. గంజాయి లేడీ డాన్ సంగీతా సాహును ఒరిస్సాకు వెళ్లి అరెస్టు చేసి తీసుక వచ్చిన టీమ్‌ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్‌రెడ్డి అభినందించారు.
Also read : పోస్టులు పెడితే అరెస్టులు చేస్తారా?.. AP పోలీసులకు హైకోర్టు బిగ్‌షాక్!
గంజాయి లేడీ డాన్ సంగీతా సాహు ఇన్‌స్ట్రా గ్రామ్‌లో సినీ హీరోయిన్ లా వీడియోలు పోస్టు చేస్తుంది. గంజాయి వినియోగం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి గంజాయి వ్యాపారులతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంది సంగీతా సాహు అలియాస్ గీతా సాహు. ఒరిస్సాలోని కుర్థా జిల్లా కాళీకోట్ గ్రామానికి చెందింది. సంగీతా సాహు గత నాలుగు సంవత్సరాల నుంచి హోల్‌సేల్ గంజాయి వ్యాపారంలోకి దిగింది. భువనేశ్వర్‌కు దగ్గరగా ఉండడంతో అనేక రాష్ట్రాల గంజాయి వ్యాపారులతో మాట్లాడుతూ వారికి గంజాయిని సరఫరా చేస్తు ఉంటుంది. సంగీతా సాహు గంజాయి లేడీ డాన్ ధూల్‌పేట్‌లో 29 కేజీలు, 11.3 కేజీలు రెండు కేసుల్లో పట్టు బడిన నిందితులకు గంజాయిని సరఫరా చేసింది. ధూల్‌పేట్‌లో శీలాబాయ్, నేహబాయ్, ఇష్‌కాసింగ్‌తోపాటు మరి కొంత మందికి గంజాయిని సరఫరా చేసినట్లు, పట్టుబడిన గంజాయి నిందితులు ఇచ్చిన వాగ్మూలంతో ఆమెపై ధూల్‌పేట్ ఎక్సైజ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. సంగీతా సాహు 2022లో గంజాయిని హైదరాబాద్‌కు తీసుకు వస్తూ రైల్వే పోలీసులకు పట్టుబడింది.
Also read : ''అమ్మలు హ్యాపీ బర్త్ డే'' భార్యకు ఎన్టీఆర్ విషెస్.. ఫొటోలు వైరల్