GHMC Demolition: జీహెచ్‌ఎంసీ కూల్చివేతలు...రణరంగంగా మారిన మోండా మార్కెట్‌

సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. జీహెచ్‌ఎంసీ అధికారులు చేపట్టిన కూల్చివేతల కార్యక్రమం రణరంగంగా మారింది. అధికారులను వ్యాపారులు అడ్డుకోవడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

New Update
FotoJet (5)

GHMC demolitions... Monda Market turns into a battlefield

GHMC Demolition : జీహెచ్‌ఎంఎసీ పరిధిలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అక్రమ నిర్మాణాల పేరిట అధికారులు కూల్చివేతలు చేపట్టగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తీవ్ర ఉద్రిక్తత(High Tension at Secunderabad Monda Market) చోటుచేసుకుంది. జీహెచ్‌ఎంసీ అధికారులు చేపట్టిన కూల్చివేతల కార్యక్రమం రణరంగంగా మారింది. మోండా మార్కెట్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాల పేరిట కొన్ని షాపులను కూల్చివేయడానికి జీహెచ్‌ఎంసీ(ghmc demolition latest) అధికారులు సన్నద్ధమయ్యారు. జేసీబీలతో ఉదయాన్నే రంగంలోకి దిగారు. అయితే వ్యాపారులకు ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేతలు చేపడుతున్నారని, తద్వారా తమ ఉపాధిని దెబ్బతీస్తున్నారని స్థానిక వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ  అధికారులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వ్యాపారులు అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదాం చోటు చేసుకుంది. స్థానికులు ఆగ్రహంతో జేసీబీలపైకి దూసుకెళ్లారు. కొంమంది జేసీబీలకు అడ్డుగా పడుకొని నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల సమక్షంలోనే వ్యాపారులు అధికారులపై దాడికి యత్నించడంతో పరిస్థితి అదుపు తప్పింది. వ్యాపారుల ఆగ్రహాన్ని చూసి భయభ్రాంతులకు గురైన జీహెచ్‌ఎంసీ సిబ్బంది అక్కడి నుండి పరుగులు తీశారు.

Also Read :  ఖానాపూర్‌ చైర్మన్ ఎన్నిక వాయిదా.. కౌన్సిల్‌లో కొనసాగుతున్న నిరసన

Monda Market Turns Into A Battlefield

జీహెచ్‌ఎంసీ అధికారులు పోలీసుల పహారాలో షాపులు నేలమట్టం చేసేందుకు జేసీబీలను తీసుకొచ్చారు. దీంతో ఏరియా పరిధిలోని వ్యాపారులు వారిని అడ్డుకున్నారు. తమకు జీవనోపాధి కల్పిస్తున్న షాపులను కూల్చివేయడాన్ని నిరసిస్తూ ఎదురు తిరిగారు. షాపులను కూలగొట్టడాన్ని నిరసిస్తూ స్థానిక పోలీస్ స్టేషన్‌ని ముట్టడించి ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో సికింద్రాబాద్ -మోండా మార్కెట్‌ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమకు న్యాయం చేయాలంటూ వందలాది మంది వ్యాపారులు మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్‌ను ముట్టడించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఏళ్ల తరబడి ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటున్నామని, నోటీసులు ఇవ్వకుండా షాపులు కూల్చడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేయడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి వ్యాపారులతో చర్చలు జరుపుతున్నారు. అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read :  తెలంగాణకు వర్ష సూచన.. రానున్న మూడు రోజులు...

మరోవైపు రాజేంద్రనగర్(rajendra-nagar) సర్కిల్ పరిధిలోని ఆరాంఘర్‌లో జీహెచ్‌ఎంసీ అధికారులు చిరు వ్యాపారుల షాపులు తొలగిస్తున్నారు. తమకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా హఠాత్తుగా కూల్చివేతలు చేపడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాస్త సమయం ఇస్తే తామే తొలగించుకుంటామని చెప్పినా వినకుండా బాధితులతో జీహెచ్‌ఎంసీ అధికారులు కఠినంగా వ్యవహరిస్తూ భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపడుతున్నారు.దీంతో బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. అధికారుల కఠిన వైఖరిని నిరసిస్తూ వ్యాపారులు ఎదురుతిరగడంతో అక్కడ తోపులాట చోటుచేసుకుంది.

Advertisment
తాజా కథనాలు