/rtv/media/media_files/2025/01/30/Ep6b8wkYmU38SN4QecxV.jpg)
Local Bodie Elections
Elections to Local Bodies : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేయించిన సమగ్ర కుల గణనపై ఒకవైపు ప్రతిపక్షాలు, బీసీ కుల సంఘాలు ఆందోళన చేస్తున్న సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు కీలక సూచన చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అంతేకాదు స్థానిక సంస్థల పదవుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. గురువారం హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలకు దిశానిర్ధేశం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ తన ప్రాభవాన్ని నిలబెట్టుకోవాలని, ప్రతీ స్థాయిలో విజయాన్ని సాధించాలని స్పష్టం చేశారు.
Also Read : Laila Trailer: విశ్వక్‌సేన్ ‘లైలా’ ట్రైలర్ చూశారా?.. నవ్వులే నవ్వుల్!
స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కోసం, పార్టీ బలోపేతం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని.. ఇందుకోసం ఎమ్మెల్యేలు పూర్తిస్థాయిలో పని చేయాలని తేల్చి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఏకగ్రీవ విజయాలు సాధించే బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలు తీసుకోవాలన్నారు. ఇదే క్రమంలో గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం వేగవంతంగా పనులు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, ఆలయాల అభివృద్ధి, వివిధ నిర్మాణాలకు అనుమతులు, నిధుల కేటాయింపు కోసం సంబంధిత మంత్రులను కలవాలని సీఎం సూచించారు.
ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ పై తిరగబడ్డ మంత్రి.. ఆ ఎమ్మెల్యేతో కలిసి ఖర్గేతో చర్చలు.. అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?
అయితే ప్రభుత్వం కీలకంగా తీసుకున్న 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలవ్వాలంటే రాజ్యంగ సవరణ తప్పనిసరి. అయితే బీసీ రిజర్వేషన్ పై అసెంబ్లీలో తీర్మానం చేసిన ప్రభుత్వం దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపింది. అయితే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం అంతా ఈజీ కాదు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదన్న రాజ్యంగం నిర్ణయానికి వ్యతిరేకంగా కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. దానికి రాజ్యంగ సవరణ తప్పనిసరి. కానీ తెలంగాణలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే రిజర్వేషన్ అంశాన్ని కేంద్రం కోర్టులోకి నెట్టిన రాష్ట్రం ప్రభుత్వం కేంద్రమే నిర్ణయం తీసుకోవడం లేదని ప్రచారం చేస్తూ ఎన్నికలకు పోయే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Murder: హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం.. తల్లీ, కొడుకుపై కత్తులతో దాడి!
మరో వైపు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం పార్టీ టికెట్లు కేటాయించడం ద్వారా తన హామీని నిలబెట్టుకున్నట్లు అవుతుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఈ క్రమంలో నేటి సమావేశం కీలకంగా మారింది.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీమేరకు బీసీ వర్గాలకు న్యాయం జరిగేలా చూడాలని సీఎం సూచించారు. బీసీ నాయకులకు అధికారంలో మద్దతుగా నిలిచేందుకు పార్టీ కట్టుబడి ఉందన్నారు. స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలన్నారు. పార్టీ నేతలు, కేడర్ ఒక్క తాటిపై నిలిచి ప్రభుత్వానికి బలాన్ని్వ్వాలని సూచించారు.
Also Read : AP Govt Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. డీఎస్సీపై చంద్రబాబు కీలక ఆదేశాలు!