Ganja: తెలంగాణలో భారీగా పట్టుబడిని గంజాయి.. ట్రాక్టర్ లో తరలిస్తూ ఒడిశా నుంచి కామారెడ్డికి అక్రమంగా ట్రాక్టర్‌లో తరలిస్తున్న 338 కిలోల గంజాయి ప్యాకెట్లను తెలంగాణ యాంటీ డ్రగ్స్ విభాగం పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ ఏపీకి చెందిన లక్ష్మీ నారాయణను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు పరారీలో ఉన్నారు. By srinivas 20 Sep 2024 in తెలంగాణ క్రైం New Update షేర్ చేయండి TG News: గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు స్మగ్లర్లను హాసన్ పర్తి, తెలంగాణ యాంటీ డ్రగ్స్ విభాగం పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్లలో దారికొండ నుంచి కామా రెడ్డి జిల్లా, బికనూర్ కు భద్రాచలం, ములుగు హనుముకొండ, సిద్ధిపేట మీదుగా చెరవేసే క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు చాకచక్యంగా స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారినుంచి సుమారు 85 లక్షల విలువ గల 338 కిలోల గంజాయితో పాటు గంజాయిని తరలిస్తున్న ట్రాక్టర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి స్మగ్లర్ అరెస్ట్ - భారీగా పట్టుబడిన గంజాయి.గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఒక గంజాయి స్మగ్లర్లను హాసన్ పర్తి మరియు తెలంగాణ యాంటీ డ్రగ్స్ వరంగల్ విభాగం పోలీసులు సంయుక్తంగా కలిసి ఆరెస్టు చేశారు. వీరి నుండి పోలీసులు సుమారు 85 లక్షల విలువ గల 338 కిలోల గంజాయితో పాటు గంజాయిని… pic.twitter.com/umpOVtChXA — Warangal Police (@warangalpolice) September 20, 2024 వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా వైరామవరం మండలం పాతకోటకు చెందిన లక్ష్మీ నారాయణ (24), అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన నారాయణ గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందింది. సెప్టెంబర్ 17న ఒడిశా రాష్ట్రం చితరకొండ మండలం నాటుగురు వద్ద 338 కిలోల గంజాయిని 96 ప్యాకెట్లుగా మార్చారు. ఎవరికి అనుమానం రాకుండా ట్రాక్టర్ ట్రాలీ అడుగు భాగంలో రహస్యంగా ఒక డబ్బాను ఏర్పాటు చేసి అందులో గంజాయి ప్యాకెట్లను భద్రపరిచారు. ఆ ట్రాక్టర్ ను దారికొండ నుంచి భద్రాచలం, ములుగు హనుముకొండ, సిద్ధిపేట మీదుగా కామారెడ్డి జిల్లా బికనూర్ మండలం చెరవేసే క్రమంలో పట్టుకున్నాం. పోలీస్ అధికారుల ఆదేశాల మేరకు హాసన్ పర్తి ఎస్.ఐ దేవీందర్ రెడ్డి హాసన్ పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో అనంతర సాగర్ క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించాం. అనుమానస్పదంగా వస్తున్న ట్రాక్టర్ ను పోలీసులు తనిఖీ చేయగా ట్రాలీ అడుగు భాగంలో రహస్యంగా ఏర్పాటు చేసిన డబ్బాలో గంజాయి ప్యాకెట్లను గుర్తించాం. అక్రమ రవాణాకు పాల్పడుతున్న ట్రాక్టర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారించగా నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. నిందితుడుకి గంజాయి తీసుకరమ్మని చెప్పిన వ్యక్తితో పాటు గంజాయిని అందజేసిన వ్యక్తులు ఇరువురు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన తెలంగాణ యాంటీ డ్రగ్స్ వరంగల్ విభాగం ఏసీపీ సైదులు, కాజీపేట ఏసీపీ తిరుమల్ తెలంగాణ యాంటీ డ్రగ్బీ వరంగల్ విభాగం ఇన్స్ స్పెక్టర్ సురేష్, హసన్ పర్తి ఇన్స్ స్పెక్టర్, చేరాల ఎస్ఐ దేవేందర్ రెడ్డి, రవితో పాటు ఇతర పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు. #telangana #odisha #kamareddy #ganja మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి