Sand Bazars: ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త...ఇక నుంచి జిల్లాల్లోనూ శాండ్‌ బజార్‌లు..!

ఇక నుంచి బ్లాక్‌ మార్కెట్‌లో ఇసుక కొనాల్సిన పని లేదు. తక్కువ ధరకే ప్రభుత్వమే ఇసుకను సరఫరా చేయనుంది. దీనికోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో శాండ్‌ బజార్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నాణ్యమైన ఇసుకను అందించడమే లక్ష్యంగా వీటిని తీసుకురానుంది. 

New Update
Sand Bazars

Sand Bazars

Sand Bazars: ప్రస్తుతం ఇల్లు కట్టుకోవటం ఎంతో కష్టమైన పని. నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయింది. ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంట్, స్టీల్, ఇటుకలు, ఇతర నిర్మాణ సామాగ్రి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇక ఇంటి నిర్మాణంలో చాలా మందికి ఎదురయ్యే ప్రధాన సమస్య ఇసుక కొరత. అవసరమైన ఇసుక కోసం ఇండ్లు కట్టుకునే చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. కొందరు అధిక ధరకు బ్లాక్‌ మార్కెట్‌లో ఇసుకను కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇక నుంచి బ్లాక్‌ మార్కెట్‌లో ఇసుక కొనాల్సిన పని లేదు. తక్కువ ధరకే ప్రభుత్వమే ఇసుకను సరఫరా చేయనుంది.  దీనికోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో శాండ్‌(ఇసుక) బజార్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వినియోగదారులకు నాణ్యమైన ఇసుకను అందుబాటు ధరకు అందించడం, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా వీటిని తీసుకురానుంది. 

ఇది కూడా చూడండి: Contaminated Food: ప్రాణాలు తీస్తున్న కలుషిత ఆహారం.. అందుకే వండిన వెంటనే తినేయాలి  


ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ శాండ్‌(ఇసుక) బజార్‌లు ఏర్పాటు చేసింది. నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్, బౌరంపేట, వట్టినాగులపల్లిలో శాండ్‌ బజార్‌లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. త్వరలో ఆదిభట్ల, పటాన్‌చెరు, ఉప్పల్, ఘట్‌కేసర్‌ ప్రాంతాల్లోనూ వీటిని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నగరంలోనే కాకుండా.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇసుక బజార్‌లు ఏర్పాటు చేయాలని తాజాగా రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. నిర్మాణాలు చేపట్టే వారికి నాణ్యమైన ఇసుకను తక్కువ ధరకు అందించడం, ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేస్తుంది. ఇటీవలే హెచ్‌ఎండీఏ పరిధిలో శాండ్‌ బజార్‌కు ఇసుకను తరలించడానికి ఆసక్తి ఉన్న ఏజెన్సీలు, వాహనదారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఇక్కడ విజయవంతమైతే మిగతా జిల్లాల్లోనూ దరఖాస్తులను ఆహ్వానించి డిమాండు మేర ఇసుకను సరఫరా చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. శాండ్‌ బజారులో టన్ను దొడ్డు ఇసుకను రూ.1,600, సన్న ఇసుకను రూ.1,800లకు విక్రయించనున్నారు. దూరాన్ని బట్టి రవాణా ఛార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. 

Also Read: రాబిన్ హుడ్ ట్రైలర్ రిలీజ్.. వార్నర్ ఎంట్రీ అదిరిపోయిందిగా!

లంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ(TGMDC) ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో శాండ్ బజారులు ఏర్పాటు చేయగా.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు. కొన్ని రోజుల క్రితం హెచ్‌ఎండీఏ పరిధిలో శాండ్‌ బజార్‌కు ఇసుకను తరలించడానికి ఆసక్తి ఉన్న ఏజెన్సీలు, వాహనదారుల నుంచి ప్రభుత్వం అఫ్లికేషన్లు ఆహ్వానించింది. ఇక్కడ విజయవంతమైతే మిగతా జిల్లాల్లోనూ అఫ్లికేషన్లు ఆహ్వానించి వినియోగదారుల డిమాండు మేర ఇసుకను సరఫరా చేయడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ శాండ్ బజార్లు అందుబాటులోకి వస్తే బ్లాక్‌లో ఇసుక కొనాల్సిన పని లేదు. ఇండ్లు కట్టుకునేవారికి భారీగా డబ్బు ఆదా కానుంది. ఇసుక పాలసీలో సంస్కరణలు తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మైనింగ్‌ శాఖ సమీక్షల్లో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా ఇసుకను నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తుండడంతో ప్రభుత్వం పెద్దఎత్తున ఆదాయాన్ని కోల్పోతుండడంతోపాటు వినియోగదారుడిపై ఆర్థికభారం పడుతోంది. ఈ నేపథ్యంలో పటిష్ఠమైన పాలసీని తీసుకురావడానికి కొన్ని నెలలుగా అధికారులు కసరత్తు చేశారు. ఇందులో భాగంగానే శాండ్‌ బజార్‌లు తెరపైకి వచ్చాయి.  

Also Read: Viral video: ఫోన్‌లో IPL మ్యాచ్ చూస్తూ బస్సు నడిపిన డ్రైవర్.. భారీ జరిమానాతోపాటు..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam terror attack : ఉగ్రదాడి.. ముస్లింలకు అసదుద్దీన్ ఒవైసీ కీలక పిలుపు

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే  ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలంతా శుక్రవారం నమాజ్ సమయంలో నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని కోరారు

New Update
Wear black bands

Wear black bands

పహల్గాంలో టెర్రరిస్టులు సృష్టించిన విధ్వంసలో 26మంది టూరిస్టులు చనిపోయిన నేపథ్యంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే  ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలంతా శుక్రవారం నమాజ్ సమయంలో  నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని సోషల్ మీడియా ద్వారా కోరారు. ఉగ్రదాడికి నిరసనగా దీన్ని పాటించాలని చెప్పారు.

అన్యాయానికి వ్యతిరేకంగా

 " కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాదులు మన దేశ ప్రజలను ఎలా చంపారో మీ అందరికీ తెలుసు. చాలా మంది గాయపడి ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఈ ఉగ్రవాద చర్యకు, అన్యాయానికి వ్యతిరేకంగా, రేపు (శుక్రవారం) మీరు నమాజ్ కోసం మసీదులకు వెళ్ళేటప్పుడు నల్లటి బ్యాండ్ ధరించి వెళ్లాలని నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను " అని ఒవైసీ అన్నారు.   భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఒవైసీ ఈ విజ్ఞప్తి చేయడం గమనార్హం.  కాగా ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం తదుపరి కార్యాచరణపై కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించగా అందులో ఒవైసీ పాల్గొన్నారు. 

Also Read :  ఆయుధాలతో శ్రీనగర్‌లోకి భారీగా విదేశీయులు.. ఎవిడెన్స్ ఉన్నాయంటున్న పాక్

Also read : Mukesh Ambani : ఎంత ఖర్చైనా భరిస్తా.. వారికి ఫ్రీ ట్రీట్మెంట్.. ముఖేష్ అంబానీ సంచలన ప్రకటన!

Advertisment
Advertisment
Advertisment