Telangana: యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్ .. ఇంజెక్షన్ ఇచ్చి 10 తులాల బంగారం చోరీ

సికింద్రాబాద్‌లో యశోద ఆస్పత్రిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ ఫేక్ డాక్టర్‌ పేషెంట్లకు బరిడీ కొట్టించింది. ఓ రోగికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి 10 తులాల బంగారం ఎత్తుకెళ్లింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Fake Doctor Theft 10 Tulas Gold In Yashoda Hospital

Fake Doctor Theft 10 Tulas Gold In Yashoda Hospital

సికింద్రాబాద్‌లో యశోద ఆస్పత్రిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ ఫేక్ డాక్టర్‌ పేషెంట్లకు బరిడీ కొట్టించింది. ఓ రోగికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి 10 తులాల బంగారం ఎత్తుకెళ్లింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఓల్డ్‌ బోయిన్‌పల్లికి చెందిన సుధారాణి సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స తీసుకుంది. గురువారం డిశ్చార్చి కావాల్సి ఉంది. ఈ సమయంలోనే ఓ మహిళా ఫేక్‌ డాక్టర్‌ ట్రీట్‌మెంట్‌ పేరుతో సుధారాణి గదిలోకి వెళ్లింది. 

Also Read: దేశంలో LPG కొరత.. కేంద్రం సంచలన ప్రకటన

ఆమె బంధువులను బయటకు పంపించింది. ఆ తర్వాత మత్తు ఇంజెక్షన్ ఇచ్చి తన ఒంటిపై ఉన్న 10 తులాల బంగారాన్ని తీసుకుంది. వెంటనే అక్కడి నుంచి పరారయ్యింది. కాసేపటికి సుధారాణి బంధువులు లోపలికి వెళ్లి చూడగా తన ఒంటిపై బంగారం లేకపోవడంతో షాక్ అయ్యారు. ఆస్పత్రి యాజమాన్యాన్ని సంప్రదించారు. వాళ్లు ఆమె ఎవరో తెలియదని చెప్పారు. ఆమె డాక్టర్‌ నటించి నగలు ఎత్తుకెళ్లిందని గ్రహించారు. 

Also read: యుద్ధం ఆగుతుందా ? అమెరికా, ఇరాన్ పెట్టిన షరతులు ఇవే

చివరికి సుధారాణి బంధువులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫేక్ డాక్టర్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. నర్సింగ్ స్టాఫ్‌ గది వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో ఆ ఫేక్ డాక్టర్ల కదలికలు రికార్డయ్యాయి. ఆమె ఎవరు అనేది ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Advertisment
తాజా కథనాలు