Kalvakuntla Kavitha : వికారాబాద్ లో తీవ్ర ఉద్రిక్తత..కల్వకుంట్ల కవిత అరెస్ట్..

వికారాబాద్ జిల్లాలో ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో జరుగుతున్న భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు తిరగబడ్డారు. వందలాది మంది రైతులు ఆందోళనకు దిగడంతో ఉద్రికత్త నెలకొంది. రైతులకు మద్దుతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆందోళనకు దిగడంతో పరిస్థితి మరింత చేయిదాటింది.

New Update
FotoJet (75)

Kalvakuntla Kavitha

Kalvakuntla Kavitha  :  వికారాబాద్ జిల్లాలో ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో జరుగుతున్న భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు తిరగబడ్డారు. ఈ రోజు వందలాది మంది రైతులు ఆందోళనకు దిగడంతో ఉద్రికత్త నెలకొంది. కాగా రైతులకు మద్దుతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆందోళనకు దిగడంతో పరిస్థితి మరింత చేయిదాటింది. వికారాబాద్‌ జిల్లా పరిగిలో ఇండస్ట్రియల్‌ కారిడార్‌ పేరిట రైతుల నుంచి భూములను బలవంతంగా లాక్కుంటున్నారని ఆరోపిస్తూ ఆమె ఉదయం నుంచి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా తులతో కలిసి వికారాబాద్‌ ఆర్డీవో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. 

 ఈ సందర్భంగా పోలీసులు, రైతులకు మధ్య జరిగిన తోపులాటతో పరిస్థితి ఒక్కసారిగా రణరంగంగా మారింది.  ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ  ప్రభుత్వం పారిశ్రామికీకరణ ముసుగులో రైతుల పొట్ట కొడుతోందని ఆమె ఆరోపించారు.భూసేకరణను వెంటనే ఆపకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. తక్షణమే భూసేకరణ నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవాలని కవిత  డిమాండ్‌ చేశారు. అంతకుముందు స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో వేలాది మంది రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ క్రమంలో రైతులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో పలువురిని  పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఆందోళనలో తెలంగాణ జాగృతి, ధర్మ సమాజ్‌ పార్టీలు పాల్గొని రైతులకు సంఘీభావం ప్రకటించాయి. 

అనంతరం వందలాది మంది రైతులతో కలిసి ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రయత్నించారు. అయితే, పోలీసులు భారీగా మోహరించి రైతులను అడ్డుకోవడంతో ఉద్రిక్తత మొదలైంది. కాగా ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న కవితను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నించడంతో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. పోలీసులను రైతులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య గంటల తరబడి తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు కవితను బలవంతంగా వాహనం నుంచి కిందకు దించి, ఎన్టీఆర్ చౌరస్తా మీదుగా మరో ప్రాంతానికి తరలించారు. ఆమె వాహనాన్ని కూడా అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. "రైతుల పొట్ట కొట్టి పరిశ్రమలు కట్టడం ఏంటని?" ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతులు ప్రాణాలకు తెగించి తమ భూములను కాపాడుకుంటుంటే, వారిపై లాఠీచార్జ్ చేయడం దుర్మార్గమంటూ మండి పడ్డారు.  భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసే వరకు తెలంగాణ జాగృతి పోరాటం ఆపదని ఆమె తేల్చి చెప్పారు. కవిత అరెస్టుతో వికారాబాద్‌లో జాగృతి కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత కొనసాగుతోంది. పోలీసు బలగాలను మోహరించారు.

Advertisment
తాజా కథనాలు