/rtv/media/media_files/2025/03/23/0HYrVK8UJmqUXjtBhCrU.jpg)
Explosion in Kushaiguda
Explosion: మేడ్చల్ జిల్లా , కుషాయిగూడ పారిశ్రామికవాడ లో దారుణం జరిగింది. కుషాయిగూడ పారిశ్రామిక వాడలో భారీ పేలుడు జరిగింది. ట్రాక్టర్ లో చెత్త నింపుతుండగా కెమికల్ బ్లాస్ట్ అయ్యింది. దీంతో చెత్త ఎత్తుతున్న కార్మికుడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.
Also Read: IPL 2025: కోలకత్తాకు అరెంజ్ అలెర్ట్..ఐపీఎల్ మొదటి మ్యాచ్ జరుగుతుందా?
ఈ మధ్య కాలంలో పారిశ్రామిక వాడల్లో పేలుడులు సంభవిస్తున్నాయి. తాజాగా మేడ్చల్ జిల్లా, కుషాయిగూడ పారిశ్రామికవాడలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కార్మికుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చూడండి: Drinking Water: నీరు ఎక్కువగా తాగడం కూడా ప్రమాదమేనా..రోజుకు ఎన్నిగ్లాసులు తాగాలి?
పారిశుద్ధ్య కార్మికుడు ట్రాక్టర్‌లో చెత్త వేస్తుండగా పేలుడు జరిగింది. భారీ శబ్ధంతో గుర్తు తెలియని వస్తువు పేలడంతో తీవ్రంగా గాయపడిన కార్మికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు తరుచుగా చోటు చేసుకుంటున్నాయి. పారిశ్రామిక వాడల్లో ఉపయోగించిన కెమికల్స్ డబ్బాలను చెత్తలో పడేస్తుంటారు. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడు తాజాగా కుషాయిగూడ పారిశ్రామికవాడలో జరిగిన ఘటనలో కెమికల్ డబ్బా పేలి ఉంటుందని స్థానికులు అంటున్నారు. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ప్రాణాలు తీస్తున్న కలుషిత ఆహారం.. అందుకే వండిన వెంటనే తినేయాలి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుషాయిగూడ లోని స్మాల్ స్కిల్ ఇండస్ట్రియల్ లో మార్చి 22 న సాయంత్రం సాడక్ నాగరాజు అనే కార్మికుడు (లేబర్) చెత్తను తొలగిస్తున్నాడు. ఆ సమయంలో కొన్ని కెమికల్స్ వల్ల ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగింది. దానితో నాగరాజు అక్కడికక్కడే చనిపోయాడు. అది గమనించిన స్థానికులు వెంటనే కుషాయిగూడ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నాగరాజు మృత దేహాన్ని గాంధీ హాస్పిటల్కి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ గుర్తు తెలియని కెమికల్స్ ను ఆ ప్రదేశంలో ఎవరు వేశారు, ఆ కెమికల్ ఏంటనే విషయం దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సీహెచ్ సాయిలు తెలిపారు.
ఇది కూడా చూడండి: High Heels: హైహీల్స్ వేసుకుంటే మానసిక ఆరోగ్య సమస్యలు తప్పవా?
Caught on camera
— Pinto Deepak (@PintodeepakD) March 23, 2025
An explosion in a garbage dump kills a man clearing the garbage at Kushaiguda, #Hyderabad #CCTVFootage #explosion@TOIHyderabad pic.twitter.com/8uKGzbFmxP