/rtv/media/media_files/2025/01/05/d2Z6e93mQqSwuDRcmqWb.jpg)
summer holidays
Summer Holidays : వేసవికాలం మొదలైంది. అప్పుడే ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం దాటితే రోడ్డు మీదకు వెళ్లాలంటేనే జడచుకునే పరిస్థితి ఏర్పడింది. వేసవితాపాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఊరటనిచ్చే వార్త చెప్పింది. ఎండలు మండిపోతున్న ప్రస్తుత తరుణంలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను పాఠశాలల విద్యార్థులకు సంబంధించి వేసవి సెలవుల షెడ్యూల్‌ను ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే విద్యార్థులకు ఒంటిపూట బడులు నడుస్తు్న్నప్పటికీ వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని స్కూళ్లకు సెలవులను అధికారులు ముందుగానే నిర్ణయించారు.
విద్యాశాఖ అధికారులు తెలిపిన తాజా సమాచారం ప్రకారం తెలంగాణలోని స్కూళ్లకు ఈ ఏడాది ఏకంగా 48 రోజుల పాటు వేసవి సెలవులు ఉండనున్నాయి. ఏప్రిల్ 24వ నుంచి జూన్ 11వ తేదీ వరకు ఈ సెలవులు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు ఈ నిబంధనలు వర్తిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. వేసవి సెలవుల అనంతరం జూన్ 12న తిరిగి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.
Follow Us