/rtv/media/media_files/2026/04/25/tgsrtc-2026-04-25-06-57-00.jpg)
TGSRTC
ఆర్టీసీ జేఏసీ నాయకులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సానుకూలంగా సాగాయి. ఆర్టీసీ ఉద్యోగులకు 11 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన చేశారు. అలాగే ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై అధికారులు, కార్మిక సంఘాల నాయకులతో కమిటీ వేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అంతేకాదు గుర్తింపు సంఘాల ఎన్నికలకు సైతం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఇక మిగిలిన అంశాలను ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక సంఘాలు కూర్చోని పరిష్కరించుకోవాలని తీర్మానం చేశామని స్పష్టం చేశారు.
Also read: RBI సంచలన నిర్ణయం.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు
ఆర్టీసీ జేఏసీ నాయకులతో నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఇకనుంచి బస్సులు యథావిధిగా నడుస్తాయని పేర్కొన్నారు. ఇదిలాఉండగా శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి అర్ధరాత్రి దాకా సుదీర్ఘంగా చర్చలు నిర్వహించారు. చర్చల్లో పురోగతి రావడంతో మూడు రోజుల పాటు జరిగిన సమ్మెకు తెరపడింది. శనివారం ఉదయం తొలి షిఫ్టు నుంచి బస్సులు రోడ్డెక్కనున్నాయి.
Also Read: బీజేపీలో చేరిక.. RTVకి మల్లారెడ్డి కోడలు సంచలన ఇంటర్వ్యూ!
మరోవైపు చర్చలకు ముందు ఇటీవల పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్‌కు మంత్రులు, జేఏసీ నేతలు నివాళులు అర్పించారు. రెండు నిమిషాల పాటు మౌనం మౌనం పాటించారు. అయితే శంకర్ గౌడ్ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం. ఇందిరమ్మ ఇల్లు, ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.
Follow Us