Batti Vikramarka: మహిళలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే బస్సు యజమానులుగా.. భట్టీ కీలక వ్యాఖ్యలు ఖమ్మంలో మహిళా శక్తి క్యాంటీన్, బస్ షెల్టర్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. వడ్డీ లేని రుణాలు ఇచ్చి మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఆర్టీసీలో డ్వాక్రా సంఘాలను భాగస్వామ్యం చేయాలని యోచిస్తున్నామన్నారు. By B Aravind 27 Oct 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి ఖమ్మం కలక్టరేట్‌లోని మహిళా శక్తి క్యాంటీన్, బస్ షెల్టర్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదివారం ప్రారంభించారు. వడ్డీ లేని రుణాలు ఇచ్చి మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. వాళ్లకి రూ.25 వేల కోట్ల వడ్డీలు రేని రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. మహిళల అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శమని అన్నారు. Also Read: డ్రగ్స్‌పై కేటీఆర్ ఇప్పుడేమంటారో: బండి సంజయ్ మహిళలు బస్సు యజమానులుగా ఆర్టీసీ సంస్థలో డ్వాక్రా సంఘాలను భాగస్వామ్యం చేయాలని యోచిస్తున్నామని పేర్కొన్నారు. మరికొద్ది రోజుల్లోనే డ్వాక్రా మహిళలు బస్సు యజమానులుగా మారుతురాని అన్నారు. వాళ్లకి వడ్డీ లేని రుణాలు అందించి ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేయిస్తామని చెప్పారు. అలాగే ఆ వాహనాలను ఆర్టీసీకీ అద్దెకు ఇప్పించేలా చేస్తామని తెలిపారు. అంతేకాదు మహిళల భాగస్వామ్యంతో ఖమ్మంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. వడ్డీ రుణాలు పంపిణీ విధానం ఓ ఉద్యమంలా ముందుకు వెళ్లాలని భట్టి అన్నారు. Also Read: 39 కానిస్టేబుళ్లపై సస్పెండ్ వేటు.. ఏక్ పోలీస్ విధానం అంటే ఏంటి ? మహిళల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్రంలో మహిళల ఉచిత ప్రయాణం వల్ల ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని తెలిపారు. మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యమన్నారు. కాంగ్రెస్ సర్కార్ మహిళల కోసమే ప్రత్యేకంగా అమ్మ ఆదర్శ పాఠశాలలను ప్రారంభించిందని తెలిపారు. మహిళల కోసం రూ.500 గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని.. రాష్ట్ర మహిళలందరనీ కూడా ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం తమ ప్రభుత్వ కృషి చేస్తోందని తెలిపారు. మహిళల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు అని అన్నారు. Also Read: Iran సుప్రీం లీడర్ ఆరోగ్య పరిస్థితి విషమం.. తర్వాతి వారసుడు ఆయనేనా ALso Read: విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. ఇరాన్‌లో 20 భారీ ఇంధన మిశ్రమాలు ధ్వంసం #telugu-news #batti-vikramarka #tgsrtc మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి