Hyderabad: డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తానని లక్షలు కొట్టేశాడు, తీరా చూస్తే!

కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన వేణుగోపాల్ దాస్.. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తానని విడతల వారీగా డబ్బులు కట్టించుకున్నాడు. నకిలీ తాళాలు, డాంక్యుమెంట్లు వారికి ఇచ్చాడు. తీరా వారు ప్లాట్ల వద్దకు వెళ్లి చూడగా వేరే వారు ఉండటంతో షాక్ అయ్యారు.

New Update
fraud,

కష్టపడి డబ్బులు సంపాదించేవాళ్లు కొందరైతే.. వారినుంచి డబ్బులు కొట్టేసేవారు మరికొందరు. ఈజీ మనీకి అలవాటు పడిన కేటుగాల్లు డబ్బులు ఎలా దోచేయాలా అని పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. మరికొందరు నమ్మిన వారినే మోసం చేస్తున్నారు. తాజాగా అలాంటిదే ఒకటి జరిగింది. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తానని లక్షల్లో తీసుకున్నాడు ఓ వ్యక్తి. 

ఇది కూడా చదవండి: 'రేవంత్‌ను చంపేందుకు కుట్ర'

నమ్మించి లక్షల్లో కొట్టేశాడు

నమ్మించేందుకు రూం తాళాలు, డాక్యుమెంట్స్ సైతం బాధితులకు ఇచ్చాడు. కానీ అక్కడికి వెళ్లి చూడగా.. అంతా షాక్ అయ్యారు. పార్లమెంట్ ఎలక్షన్లకి ముందు జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వేణుగోపాల్ అనే వ్యక్తి విడతల వారీగా బాధితు నుంచి డబ్బులు తీసుకున్నాడు.

ఇది కూడా చదవండి: మేడిగడ్డ అందుకే కుంగింది.. విజిలెన్స్ రిపోర్ట్ లో సంచలన అంశాలు!

ఆ సమయంలోనే డాంక్యుమెంట్లు ఇవ్వాలని అడగగా.. ఎంపీ ఎన్నికలు ఉన్నాయని వాయిదా వేస్తూ వచ్చాడు. ఇక లాభం లేదని అతడిని ఒత్తిడి చేయగా.. నకిలీ తాళాలు, డాంక్యుమెంట్లు తీసుకొచ్చి ఇచ్చాడు. అదంత నిజమేనని నమ్మిన బాధితులు ప్లాట్ల వద్దకు వెళ్లి చూడగా.. అంతా షాక్ అయ్యారు. 

ఇది కూడా చదవండి: సీఎం రేవంత్‌కు ముప్పు.. సెక్యూరిటీ మార్పు!

కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన వేణుగోపాల్ దాస్.. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తానని బాగా ప్రచారం చేసుకున్నాడు. మొదటి విడతగా తక్కువ మొత్తం కట్టాలని నమ్మించాడు. వేణుగోపాల్ మాటలు నమ్మిన కొందరు మహిళలు నిజమేనని అనుకున్నారు. దీంతో మొదటివిడతగా రూ.50,000 కట్టారు.

ఇది కూడా చదవండి:  బాంబ్ బెదిరింపులు.. 62 విమానాలు రద్దు!

దీంతో డబ్బులు కట్టిన వారి వివరాలను వేణుగోపాల్ తీసుకున్నాడు. ఆపై వారిని నమ్మించేందుకు నకిలీ తాళాలు, డాంక్యుమెంట్లు తయారు చేసి డబ్బులు కట్టిన మహిళలకు అందించాడు. అంతేకాకుండా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కూడా అవుతుందని నమ్మించాడు. వేణుగోపాల్ మాటలు నమ్మిన బాధితులు ఒక్కొక్కరు దాదాపు రూ.లక్ష నుంచి రూ.2.50 లక్షల వరకు కట్టారు.

అనంతరం అమౌంట్ కట్టి బాధితులు డాక్యుమెంట్లు, బెడ్ రూం తాళాలు పట్టుకుని డబుల్ బెడ్ రూం ప్లాట్ల వద్దకు వెళ్లారు. అయితే వారు వెళ్లేసరికి అక్కడ వేరేవాళ్లు ఉండటంతో అంతా షాక్ అయ్యారు. ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో మోసపోయామని భావించిన బాధితులు కేపీహెచ్ బీ కాలనీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. వేణుగోపాల్ దాస్ ను అరెస్టు చేసి తమ డబ్బులు ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు