/rtv/media/media_files/2025/02/20/BorJSzmMvGnYlUwWL4cH.webp)
Rajalingamurthy Murder
Rajalingamurthy Murder: భూపాలపల్లి(Bhupalpalli)లో నాగవెల్లి రాజలింగమూర్తి హత్య రాజకీయ రంగు పులుముకుంది. ఈ హత్య బీఆర్ఎస్ నేతల(BRS Leaders) మెడకు చుట్టుకుంటోంది. హత్య వెనుక స్థానిక మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి(Gandra Venkataramana Reddy) హస్తం ఉందని, మాజీ మంత్రి కేటీఆర్(Former Minister KTR) ఆదేశాలతోనే ఈ హత్య జరిగిందని మృతుని భార్య ఆరోపించడం సంచలనంగా మారింది. ఓటమితో నైరాశ్యం నిండిన బీఆర్ఎస్ లో కొత్త జోష్ ను నింపడానికి ఒకవైపు బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ వేడుకలకు సిద్ధం అవుతుండగా, మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు రాజలింగమూర్తి హత్య బీఆర్ఎస్ కు మింగుడు పడడం లేదు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై భూపాలపల్లికి చెందిన సామాజిక కార్యకర్త, మాజీ కౌన్సిలర్ భర్త అయిన నాగవెల్లి రాజలింగమూర్తి కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నాడు. ముందుగా జిల్లా కోర్టులో కేసు వేయగా దాన్ని తీసుకోవడానికి కోర్టు నిరాకరిం చింది. అయితే ఆ తరువాత మెజిస్ట్రేట్ ఆదేశాలతో కేసు నమోదైంది. ఈ రోజు హైకోర్టులో ఈ కేసు విచారణకు రానుంది. ఈ క్రమంలోనే నిన్నరాత్రి రాజలింగమూర్తిని కొంతమంది దుండగులు నడిరోడ్డుపై నరికి చంపారు. అయితే దీని వెనుక భూ సంబంధ లావాదేవీలు ఉన్నాయని వార్తలు వస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి, మంత్రులు, స్థానిక నాయకుల జోక్యంతో రాజకీయ రంగు పులుముకుంది.ఐదుగురు వ్యక్తులపై రాజలింగం కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలువురిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టినట్లు భూపాలపల్లి డీఎస్పీ సంపత్ కుమార్ తెలిపారు.
Also Read: City Killer Asteroid:దూసుకొస్తున్న "సిటీ కిల్లర్".. దేశంలో ఆ రెండు నగరాలు ఇక కనిపించే అవకాశం లేదా!
ఈ హత్యను తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ప్రతి విషయంలో అధికార పక్షానికి కొరకరాని కొయ్యగా తయారైన ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలకు చెక్ పెట్టే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడానికి కాంగ్రెస్ సిద్ధంగ లేదు. రుణమాఫీ, రైతుభరోసా, రేషన్ కార్డులు ఇలా ప్రతి అంశంలో ప్రభుత్వాన్ని నిలదీస్తున్న బీఆర్ఎస్ పై ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, తదితరులపై న్యాయపోరాటం చేస్తున్న రాజలింగమూర్తి దారుణ హత్యకు గురికావడంతో కాంగ్రెస్ ఈ అవకాశాన్ని వదులుకో దలుచుకోలేదు. ఇప్పటికే ఈఘటనపై తెలంగాణ సీఎం కార్యాలయం(సీఎంవో) ఆరా తీసింది. హత్య కు గల కారణాలపై నిఘా వర్గాల నుంచి సమాచారం కోరింది. దీంతో కీలక వివరాలను అధికారులు సేకరించారు. మేడిగడ్డ బ్యారేజీలో అవకతవకలు జరిగాయని రాజలింగమూర్తి కోర్టులో పిటిషన్ వేయగా ఈ కేసు వాదిస్తున్న లాయర్ 6 నెలల క్రితం ఆకస్మికంగా మృతిచెందాడు. తాజాా రాజలింగమూర్తి హత్యకు గురయ్యాడు. దీంతో ఈ హత్య కేసును సీబీసీఐడీకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: America: పనామా హోటల్ లో 300 మంది భారతీయులు సాయం కోసం కేకలు!
కేటీఆర్ సూచన మేరకే….మూర్తి భార్య సరళ ఆరోపణ
కాళేశ్వరం భాగమైన మేడిగడ్డ కుంగుబాటుపై నా భర్త న్యాయపోరాటం చేస్తున్నాడు. అలాగే కొంతమంది భూ ఆక్రమణదారులపై పోరాటం చేస్తున్నాడు. ఈరోజు కేసు విచారణ జరుగుతుంది. ఒకవేళ రాజలింగమూర్తి కేసు గెలిస్తే తమ ఆటలు సాగవనే తన భర్తను హత్య చేశారని భార్య సరళ ఆరోపించింది. కేటీఆర్ సూచనతోనే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన అనుచరులు హరిబాబు, సంజీవ్, రవి తదితరులు కలిసి ఈ హత్య చేశారని ఆరోపించింది. మేడిగడ్డ బ్యారేజీ కేసును విత్ డ్రా చేసుకోమని గండ్ర వెంకటరమణారెడ్డి బెదిరించాడు. పదిలక్షలిస్తామని చెప్పాడు. కానీ, తన భర్త న్యాయంకోసం నిలబడ్డందుకే చంపేశారని సరళ ఆరోపిస్తోంది. ఈ విషయంలో న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేసింది. నిందితులను పట్టుకునేంత వరకు అంత్యక్రియలు కూడా చేయమని భార్య సరళ స్పష్టం చేశారు.
Also Read: ఇంత పిరికోడివి ఏంట్రా.. ప్రేమ, పెళ్లన్నాడు.. నుదుటిపై బొట్టు పెట్టి పారిపోయాడు!
నాకేం సంబంధం లేదు
అయితే ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. హత్య నెపం బీఆర్ఎస్, కేసీఆర్, హరీశ్‌రావుతో పాటు తనపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ హత్యపై సీఐడీ, సీబీఐ విచారణ చేసుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టంచేశారు. ఈ హత్య కేవలం భూ తగాదాల వల్ల జరిగిందని స్థానికులు చెబుతున్నారని అలాంటి దీన్ని రాజకీయ హత్యగా చూపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు.