Phone Phonng Case : మాజీ మంత్రి హ‌రీష్‌రావుకు మ‌రోమారు ఊర‌ట‌.. హైకోర్టు ఏం చెప్పిందంటే

మాజీ మంత్రి హ‌రీష్ రావు త‌న ఫోన్ ట్యాప్ చేయించాడ‌ని ఆరోపిస్తూ చ‌క్ర‌ధ‌ర్ గౌడ్ అనే వ్య‌క్తి ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. స‌ద‌రు కేసును కొట్టివేయాలంటూ హ‌రీష్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. ఫిబ్ర‌వ‌రి 12 వ‌ర‌కు అరెస్ట్ చేయ‌వ‌ద్దంటూ హైకోర్టు ఆదేశించింది.

New Update
Harish Rao

Harish Rao

Phone Phonng Case : గ‌త బీఆర్ ఎస్  ప్ర‌భుత్వం హ‌యాంలో ప‌లువురు ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కుల ఫోన్లు ట్యాప్ చేసింద‌న్న ఆరోప‌ణలు ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే .ఈ క్ర‌మంలో మాజీ మంత్రి హ‌రీష్ రావు త‌న ఫోన్ ట్యాప్ చేయించాడ‌ని ఆరోపిస్తూ చ‌క్ర‌ధ‌ర్ గౌడ్ అనే వ్య‌క్తి పంజాగుట్ట పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే.  ఈ క్ర‌మంలో త‌నపై న‌మోదైన కేసును కొట్టివేయాలంటూ హ‌రీష్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు హ‌రీష్‌రావుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఫిబ్ర‌వ‌రి 12 వ‌ర‌కు ఆయ‌న‌ను అరెస్ట్ చేయ‌వ‌ద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. 

Also Read: మహాకుంభమేళాకు చేరుకున్న మోదీ... త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం

హ‌రీష్‌రావుకు గ‌తంలోనే హైకోర్టు ప‌గా హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి కోర్టును ఆశ్ర‌యించారు. ఈ మేరకు గతంలో విచారణ చేపట్టిన ధర్మాసనం ఆయన్ను అరెస్టు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా వాటిని పొగడిస్తూ ఈనెల 12 వరకూ అరెస్టు చేయవద్దని ఆదేశించింది.ఈనెల 12న తమ లాయ‌ర్‌తో వాద‌న‌లు వినిపిస్తామ‌ని ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ కోర్టునుంచి అనుమ‌తి తీసుకోవ‌డంతో హైకోర్టు అంగీక‌రించింది.ఈ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన మాజీ డీసీపీ రాధాకిషలుమార్లు పొడిగిస్తూ వ‌స్తోంది. తాజాగా మ‌రోసారి పొడిగించింది. ట్యాపింగ్ కేసులో చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంన్ రావు, అడిషనల్ ఎస్పీ భుజంగరావుల‌కు తెలంగాణ హైకోర్టు ఇటీవల షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 

ఇది కూడా చదవండి: BIG BREAKING: డిప్యూటీ సీఎం పవన్ కు తీవ్ర అనారోగ్యం

ఈ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, సస్పెండ్ అయిన అదనపు ఎస్పీలు ఎం తిరుపతన్న, ఎన్ భుజంగరావు, మాజీ డీసీపీ (టాస్క్ ఫోర్స్) రాధా కిషన్ రావులను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్‌పై ఉన్న భుజంగరావు మినహా మిగిలిన నిందితులు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే ఈ కేసులో అదనపు ఎస్పీ ఎం తిరుపతన్న రెగ్యులర్ బెయిల్‌పై విడుదల అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఎన్ భుజంగరావు, మాజీ డీసీపీ( టాస్క్ ఫోర్స్)రాధా కిషన్ రావులకు బెయిల్ లభించింది. అయితే బెయిల్‌కు సంబంధించి పలు కండీషన్లు విధించారు న్యాయమూర్తి. లక్ష చొప్పున రెండు ష్యూరిటీలు సమర్పించాలని అలాగే పాస్ పోర్టు స్వాధీనం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరించాలని...సాక్ష్యులను ప్రభావితం చేయరాదని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. 

Also Read: పేరుకి గజదొంగ.. ప్రేమలో ఆణిముత్యం: చోరీ సొమ్ముతో ప్రియురాలికి రూ.3కోట్ల ఇల్లు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు