/rtv/media/media_files/2025/03/09/HueISJx6rq19fDsgLbvN.jpg)
Dr Sravan Dasoju Photograph: (Dr Sravan Dasoju)
తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రావణ్ కుమార్‌ను ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆయన సోమవారం (రేపు) నామినేషన్ వేయనున్నారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. తెలంగాణ అసెంబ్లీలో 5 MLA కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్యే సంఖ్యాబలం ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 4, బీఆర్ఎస్ పార్టీ ఒకటి దక్కించుకునే అవకాశం ఉంది.
Also read: తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. వారికి రుణమాఫీ కోసం రూ.33 కోట్లు మంజూరు
Dr. Dasoju Sravan is BRS party MLC candidate under MLA quota pic.twitter.com/kqgc7LOM86
— Naveena (@TheNaveena) March 9, 2025
ఇప్పటికే కాంగ్రెస్ అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్, విజయ శాంతిల పేర్లు ఖరారు చేసింది. అధికార పార్టీతో పొత్తు పెట్టుకున్న సీపీఐ పార్టీకి కేటాయించిన అభ్యర్థిని మాత్రం ఇంకా ఎంపిక చేయలేదు. మరో వైపు బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు అభ్యర్థులను ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దించనున్నట్లు వార్తలు వచ్చాయి. సోమవారం నామినేషన్లు పూర్తైతే ఈ విషయంలో క్లారిటీ వస్తుంది. ఒక తెలంగాణ మొత్తం అసెంబ్లీ స్థానాలు 117 కాగా ఒక్కో MLCకి 21 MLAల ఓట్లు కావాలి.
Also read: BIG BREAKING: కాంగ్రెస్ MLC అభ్యర్థుల పేర్లు ఖరారు