Special Trains: పండగవేళ రైల్వే శాఖ శుభవార్త..644 స్పెషల్‌ ట్రైన్స్‌!

దసరా, బతుకమ్మ పండగల వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నెల 15 వరకు 644 ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.

New Update
Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌..జులై 29 నుంచి 31 వరకు 62 రైళ్లు రద్దు..!

South Central Railway : దసరా పండుగ సెలవులతో హైదరాబాద్‌ లోని ప్రధాన రైల్వే స్టేషన్లన్ని కూడా ఫుల్‌ రష్‌ గా ఉన్నాయి. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వైపునకు వెళ్లే రైళ్లలో కనీసం కాలుపెట్టే చోటు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమయ్యారు. 

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రెడీ అయ్యింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నెల 15 వరకు 644 ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని రైల్వేశాఖ అధికారులు శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్, కాచిగూడ, మహబూబ్ నగర్, తిరుపతి రైల్వే స్టేషన్ల నుంచి ముఖ్యమైన రూట్లలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

దక్షిణ మధ్య రైల్వే నుంచి 170 రైళ్లు, ఇతర ప్రాంతాల నుంచి  115 రైళ్లు నడపనున్నారని అధికారులు తెలిపారు. మరో 185 రైళ్లు అందుబాటులోకి రానున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు రూట్లను కూడా ప్రకటించారు. సికింద్రాబాద్-దానాపూర్, సికింద్రాబాద్-రాక్సల్, సికింద్రాబాద్, సికింద్రాబాద్ , సికింద్రాబాద్ – విశాఖపట్నం,సికింద్రాబాద్-సుబేదార్ గంజ్, హైదరాబాద్-గోరఖ్‌పూర్, మహబూబ్‌నగర్-గోరఖ్‌పూర్,  ఉన్నాయి. సికింద్రాబాద్-సంత్రాగచ్చి, సికింద్రాబాద్-కాకినాడ, సికింద్రాబాద్-తిరుపతి, కాచిగూడ-నగర్ సోల్, సికింద్రాబాద్-మడ్లాటౌన్, తిరుపతి-మచిలీపట్నం, తిరుపతి-అకోలా, తిరుపతి-పూర్ణ, తిరుపతి-హిసార్, నాందేడ్-ఈరోడ్, జాల్నా-చాప్రా, తిరుపతి-షిర్డీ తదితర ముఖ్యమైన రూట్లలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

Also Read: నవరాత్రుల స్పెషల్‌...భక్తుల కోసం ప్రత్యేక యాప్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు