BIG BREAKING: బిగ్ అలెర్ట్.. గ్యాస్ బుకింగ్ పేరుతో మోసాలు

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరతపై ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో సైబర్ నేరగాళ్లు ఈ పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని మోసాలకు పాల్పడుతున్నారు.

New Update
Cyber frauds in Gass booking

Cyber frauds in Gass booking

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరతపై ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో సైబర్ నేరగాళ్లు ఈ పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఆన్‌లైన్‌లో గ్యాస్ బుకింగ్ కోసం వెతికే అమాయకులను టార్గెట్ చేస్తున్నారు. వెంటనే సిలిండర్ డెలివరీ చేస్తామని, అదనపు సిలిండర్లు అందిస్తామని చెబుతూ సోషల్ మీడియాలో ఫేక్ ప్రకటనలతో బురిడీ కొట్టిస్తున్నారు. వీళ్లపట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూచించారు. వాట్సాప్, SMSల నుంచి ఫేక్ వెబ్‌సైట్‌ల లింకు పంపిస్తూ జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. 

Also Read: వంట గ్యాస్ సిలిండర్ల కొరత.. కేంద్రం సంచలన ప్రకటన

ఆన్‌లైన్‌లో ముందుగా డబ్బులు చెల్లిస్తేనే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తామని వచ్చే మెసేజ్‌లను నమ్మోద్దని.. వాళ్లు పంపే లింక్‌లపై క్లిక్ చేయొద్దని కోరుతున్నారు. సిలిండర్ బుక్ చేసుకోవాలన్నా లేదా ఆన్‌లైన్ చెల్లింపులు చేయాలన్నా గ్యాస్ కంపెనీల అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలని చెబుతున్నారు. లేదంటే గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్లాలని సూచిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు మీ బ్యాంకు అకౌంట్ వివరాలు, ఓటీపీ, UPI పిన్ లాంటివి అడిగితే ఎట్టి పరిస్థితుల్లోను చెప్పొద్దని తెలిపారు. 

Also Read: బాయ్‌ఫ్రెండ్‌తో మోనాలిసా జంప్.. కాసేపట్లో పెళ్లి

ఫేక్ వెబ్‌సైట్లకు వివరాలు ఇస్తే.. సైబర్ నేరగాళ్లకు మీ ఆర్థిక సమాచారం వెళ్లి బ్యాంకు అకౌంట్‌లు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నెంబర్ 1930కి కాల్ చేయాలని సూచించారు. లేదా http://cybercrime.gov.inవెబ్‌సైట్‌లో కూడా ఫిర్యాదు చేయొద్దని తెలిపారు.  

Advertisment
తాజా కథనాలు