CV Anand: తెలంగాణ డీజీపీగా సీవీ ఆనంద్‌ నియామకం

తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. యూపీఎస్సీ నిబంధనల ప్రకారం ఎంపిక కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం G.O.Rt.No. 553 ద్వారా ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

New Update
BREAKING

BREAKING

తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్(cv-anand) నియమితులయ్యారు. యూపీఎస్సీ నిబంధనల ప్రకారం ఎంపిక కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం G.O.Rt.No. 553 ద్వారా ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన.. తక్షణమే బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయనకు నెలకు రూ. 2,25,000 అపెక్స్ స్కేల్ వేతనం వర్తించనుంది. 

Also Read :  హైకోర్టును ఆశ్రయించిన నటి ఆషురెడ్డి.. ఎఫ్‌ఐఆర్‌ కొట్టివేయాలంటూ..

హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా

1991 బ్యాచ్‌కు చెందిన ఈ సీనియర్ ఐపీఎస్ అధికారి. 2021 డిసెంబర్ నుంచి 2023 అక్టోబర్ వరకు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌గా పనిచేసి నగర ప్రజలకు చేరువయ్యారు. 2017లో అదనపు డీజీగా, 2021లో కేంద్ర సర్వీసుల్లో అడిషనల్ డైరెక్టర్ జనరల్‌గా ఎదిగారు. ఆయన పనితీరును మెచ్చిన ప్రభుత్వం, అడిషనల్ డీజీగా ఉన్నప్పుడే 2023 ఆగస్టులో ఆయనకు డీజీపీ హోదా కల్పించింది. గతేడాది ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆయనను కమిషనర్ పదవి నుంచి తాత్కాలికంగా తప్పించారు. అయితే, ఏ అధికారిని అయితే ఎన్నికల సమయంలో పక్కన పెట్టారో, ఇప్పుడు అదే అధికారిని మొత్తం రాష్ట్రానికే పోలీస్ బాస్‌గా ప్రభుత్వం నియమించడం విశేషం.

చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, సీవీ ఆనంద్ ఒకప్పుడు స్టార్ క్రికెటర్. 1986లో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో భారత అండర్-19 జట్టులో ఆయన సభ్యుడిగా ఉన్నారు. హైదరాబాద్ తరఫున అండర్-19, అండర్-22 జట్లలో ప్రాతినిధ్యం వహించి మైదానంలో పరుగుల వర్షం కురిపించారు. ఆటపై ఆయనకున్న మక్కువ అక్కడితో ఆగలేదు.. నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ సమయంలో అథ్లెటిక్స్‌లో ఏకంగా 8 గోల్డ్ మెడల్స్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పటికీ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొంటూ తన ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటున్నారు.

Also Read :  నడినెత్తిన నిప్పుల వర్షం.. 46 డిగ్రీలు దాటిన ఉష్ణ్రోగ్రత.. నలుగురు మృతి

Advertisment
తాజా కథనాలు