/rtv/media/media_files/2026/04/28/fotojet-2026-04-28-10-47-32.jpg)
Constable reels claiming to make CM Revanth
Constable Reels:శాఖ పరమైన నిబంధనలను పాటించి బాధ్యతగా విధులు నిర్వహించాల్సిన ఒక పోలీస్ కానిస్టేబుల్, సోషల్ మీడియా రీల్స్ వ్యామోహంలో పడి హద్దులు దాటిన తీరు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భద్రతా విభాగంలో పనిచేస్తున్న చరణ్ యాదవ్ (ఇన్ స్టాగ్రామ్ ఐడీ nikhil_yadavu_123) అనే కానిస్టేబుల్, తన ఉద్యోగాన్ని,యూనిఫామ్‌ను అడ్డుపెట్టుకుని చేస్తున్న వీడియోలు నెటిజన్ల ఆగ్రహానికి కారణమవుతున్నాయి. సామాన్య ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తే ఇలాంటి వివాదాస్పద రీల్స్ చేస్తూ వార్తల్లో నిలవడం పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.
ముఖ్యమంత్రి సెక్యూరిటీ విధుల్లో ఉన్నాననే విషయాన్ని వాడుకుంటూ చరణ్ యాదవ్ చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "మీరు సీఎం రేవంత్ రెడ్డిని కలవాలనుకుంటున్నారా? అయితే నాకు మెసేజ్ లేదా కాల్ చేయండి.. నేనే మీకు మీటింగ్ అరేంజ్ చేస్తాను" అంటూ అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తిని కలిపించే అధికారం తనకే ఉన్నట్లుగా అతను మాట్లాడటం చర్చనీయాంశమైంది. సీఎం కార్యాలయం పేరుతో ఈ రకమైన 'బ్రోకరిజం' తరహా ప్రకటనలు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం అతివిశ్వాసమే కాకుండా, భద్రతా నియమాలను తుంగలో తొక్కడమేనని తోటి అధికారులు అభిప్రాయపడుతున్నారు.
కేవలం రాజకీయ ప్రముఖుల పేర్లే కాకుండా, ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో కూడా ఇతను ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఎస్ఆర్‌హెచ్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ టికెట్లు ఇప్పిస్తానంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసి హంగామా సృష్టించాడు. అంతేకాకుండా, పోలీస్ యూనిఫాంలో ఉండి కూడా అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ వీడియోలు చేయడం ఇతనికి పరిపాటిగా మారింది. విధి నిర్వహణలో ఉండి ఇలాంటి ప్రవర్తనను ప్రదర్శించడం వల్ల మొత్తం పోలీసు వ్యవస్థ ప్రతిష్ట దెబ్బతింటోందని సామాన్యులతో పాటు పోలీసు శాఖలోని ఇతర సభ్యులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: "డార్లింగ్ 4K" రీ-రిలీజ్ విధ్వంసం! ఆ రికార్డులన్నీ లేపేసిన ప్రభాస్!
పోలీస్ సిబ్బంది సోషల్ మీడియా వాడకంపై ఉన్నతాధికారులు ఇప్పటికే అనేక కఠిన ఆంక్షలు విధించినప్పటికీ, ఈ కానిస్టేబుల్ మాత్రం అవేవీ పట్టించుకోకుండా రీల్స్ పిచ్చితో వ్యవస్థను హేళన చేస్తున్నాడని నెటిజన్లు మండిపడుతున్నారు. చరణ్ యాదవ్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పలువురు యూజర్లు, డీజీపీ,హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ట్యాగ్ చేస్తూ వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: ’కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
అత్యంత కీలకమైన భద్రతా విభాగంలో ఉండి ఇలాంటి పిచ్చి వేషాలు వేసే వారిపై చర్యలు తీసుకోకపోతే అది శాఖా పరమైన క్రమశిక్షణకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. అధికారుల విచారణలో ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో చూడాలి.
Follow Us